గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 31 ఆగస్టు 2018 (21:42 IST)

డల్లాస్‌లో నాట్స్ సమావేశం.. సంబరాలపై చర్చించిన నాట్స్ బోర్డు ఛైర్మన్

డల్లాస్: ప్రతి రెండేళ్లకోసారి అంగరంగవైభవంగా జరిపే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలపై చర్చించేందుకు నాట్స్ డల్లాస్‌లో సమావేశమైంది. వచ్చే ఏడాది జరిగే ఈ సంబరాల కోసం నాట్స్ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. డల్లాస్‌లో నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ గుత్

డల్లాస్: ప్రతి రెండేళ్లకోసారి అంగరంగవైభవంగా జరిపే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలపై చర్చించేందుకు నాట్స్ డల్లాస్‌లో సమావేశమైంది. వచ్చే ఏడాది జరిగే ఈ సంబరాల కోసం నాట్స్ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. డల్లాస్‌లో నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడిలు కలిసి నాట్స్ కీలక సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. 
 
ఈసారి సంబరాలు డల్లాస్‌ వేదికగా మెమోరియల్ వీకెండ్‌లో జరుగనుండటంతో డల్లాస్‌ టీం ఇప్పటి నుంచే చేపట్టాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. డల్లాస్‌ టీం సభ్యులతో పాటు నాట్స్ చాప్టర్స్‌కు చెందిన నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా నాట్స్ నాయకత్వం నుంచి కిషోర్ కంచర్ల, బాపు నూతి, రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, శ్రీనివాస్ కొమ్మినేని, సురేంద్ర దూళిపాళ్ల, భాను, సుధాకర్ పెన్నం, జ్యోతి వనం, ప్రసాద్ కండేరి, విజయ్, రాజాజీ, పూర్ణ, సాయి, మణిందర్, వెంకట్ పోలినీడు, అశోక్ గుత్తా,  శరత్ గూడూరు, సాయి కాటూరు, ఆస్టిన్ నుంచి రాజేశ్ చిలుకూరి తదితరులు పాల్గొన్నారు.
 
నాట్స్ డల్లాస్ టీం ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలు.. చేపట్టబోయే కార్యక్రమాలను ఇందులో వివరించింది. డల్లాస్ టీం పక్కా ప్రణాళికతో సంబరాల కోసం చేస్తున్న కృషిని శ్రీనివాస్ గుత్తికొండ, శ్రీనివాస్ మంచికలపూడి ప్రత్యేకంగా అభినందించారు.