బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 నవంబరు 2022 (20:44 IST)

లాస్ ఏంజెల్స్ నాట్స్ కార్యవర్గ సమావేశం: చాప్టర్ కొత్త కార్యవర్గాన్ని పరిచయం చేసిన నాయకత్వం

NATs
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ... లాస్ ఏంజెల్స్‌లో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోంది.. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో లాస్ఏంజెల్స్ నాట్స్ చాప్టర్ తాజాగా నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించింది. కోవిడ్ తర్వాత లాస్ ఏంజెల్స్ నాట్స్ సభ్యులు ప్రత్యక్షంగా నిర్వహించిన సమావేశం ఇది. ఈ సమావేశములో నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి లాస్ ఏంజెల్స్ చాప్టర్ నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు.
 
లాస్ ఏంజెల్స్ చాప్టర్ కో- ఆర్డినేటర్ గా మనోహర రావు మద్దినేని, జాయింట్ కో-ఆర్డినేటర్‌గా మురళి ముద్దనకి బాధ్యతలు అప్పగించడం జరిగింది. వీరిద్దరి నేతృత్వంలో పనిచేసే కార్యవర్గ బృందాన్ని ఈ సమావేశంలో నాట్స్ సభ్యులందరికి పరిచయం చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో గత కార్య వర్గం చేసిన సేవ కార్యక్రమాలు ప్రశంసనీయమని నాట్స్ నాయకులు తెలిపారు. అదే స్ఫూర్తితో కొత్త నాయకత్వం పనిచేస్తుందని కొత్తగా బాధ్యతలు తీసుకున్న చాప్టర్ నాయకులు హామీ ఇచ్చారు.
 
ప్రతి నెల నాట్స్ బృందం అంతా వర్చువల్‌గా సమావేశం కావాలని, ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ప్రత్యక్ష సమావేశాల ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని నిశ్చయించారు. ఈ సమావేశంలో స్థానిక నాట్స్ నాయకులు వెంకట్ ఆలపాటి, వంశీ మోహన్ గరికపాటి, నాట్స్ స్పోర్ట్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ దిలీప్ సూరపనేని, ఈవెంట్స్ చైర్ బిందు కామిశెట్టి, హెల్ప్‌లైన్ చైర్ శంకర్ సింగంశెట్టి, స్పోర్ట్స్ చైర్ కిరణ్ ఇమ్మడిశెట్టి, కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ అరుణ బోయినేని, మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ చైర్ ప్రభాకర్ రెడ్డి పాతకోట, ఫండ్ రైజింగ్ చైర్ గురు కొంక, కో చైర్స్, వాలంటీర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.