శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 18 జూన్ 2015 (21:02 IST)

ఇమ్మిగ్రేషన్ సలహాలకు ఉచితంగా సంప్రదించేందుకు తానా ఇమ్మిగ్రేషన్ ఫోరం కమిటీ

జూలై నెలలో 2-4న డిట్రాయిట్‌లో జరగనున్ను 20వ TANA మహాసభలను పురస్కరించుకుని తానా కన్వీనర్ శ్రీ గంగాధర్ నాదెళ్ళ మరియు తానా ప్రెసిడెంట్ శ్రీ మోహన్ నన్నపనేని ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా జరుగనున్న ఈ మహాసభలకు పలురంగాలకు చెందిన అమెరికా, భారత్ మరియు కెనడా నుండి పలురంగాలకు చెందిన ప్రముఖులు, అమెరికా, భారత్ నుండి ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, నవలా రచయితలు, వేదపండితులు, అష్టావధాన, శతావధాన దిగ్గజాలు, ప్రముఖ తెలుగు పండితులు, తెలుగు కవులు, ప్రముఖ పాత్రికేయులు, కళాకారులు, ప్రదర్శనకారులు, న్యాయవాదులు విచ్చేస్తున్నారు. 
 
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అవసరాలకు, వీసా అవసరాలకు వాటికి తగిన సంప్రదింపులకు విద్యార్ధులను, ఉద్యోగస్తులను, వారిపై ఆధారపడిన వారిని దృష్టిలో పెట్టుకుని 20వ తానా మహాసభలలో తానా కార్యవర్గం ఇమ్మిగ్రేషన్ ఫోరం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మెన్‌గా రాజ్ గడ్డం, లలిత్ కుమార్ వడ్లముడి, అశోక్ కొల్ల మరియు సుధాకర్ కాట్రగడ్డ కో-చైర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ కమిటీతో ముఖాముఖీ మరియు కమిటీ వల్ల ప్రయోజనాలు వీరితో సంప్రదించిన విశేషాలు.
1)ఈ జూలై నెల మొదటివారంలో డిట్రాయిట్లో జరగనున్న తానా సమావేశాలకు ఇమ్మిగ్రేషన్ ఫోరం కమిటీ విభాగం ముఖ్య లక్ష్యం గూర్చి వివరించండి?
అమెరికాలో ఉంటున్న విద్యార్ధులకి, వ్యాపార రంగంలో ఉన్న వారికి, గ్రీన్ కార్డు, అమెరికాలో స్థిరపడదామన్నవారికి సులభ రీతిలో ఉచితంగా విలువైన సలహాలు, వారివారి ప్రశ్నలకు ప్రయోజనపడే సమాధాలను అందచేయడమే ఈ విభాగం యొక్క ముఖ్య ఉద్దేశం.
 
2)ఈమధ్య కాలంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలలో చాలా మార్పులుచేర్పులు వచ్చాయి. ప్రత్యేకంగా H-4 వీసాలో ఉన్న వారికి ఉద్యోగం చేసుకునే సౌలభ్యం అమెరికన్ గవర్నమెంట్ వారు ఇచ్చారు. ఈ విషయం గురించి చాలామందికి ఇప్పటికి పూర్తిగా అవగాహన లేదు. కొంచం వివరంగా చెప్తారా?
అమెరికాలో న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తిగారి సెషన్లో ఈమధ్య కాలంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలలో వచ్చిన మార్పులుచేర్పులు, వాటిని ఏవిధంగా పాటించాలన్న విషయాలు గురించి జూలై 4వ తేదిలో చర్చిస్తారు..
 
3) అమెరికా వలస వచ్చినవారిలో ప్రత్యేకంగా విద్యార్ధులకి ఇమ్మిగ్రేషన్ విషయాల మీద మార్గదర్శకత అవసరం ఉంది. వారికి ఈ ఇమ్మిగ్రేషన్ ఫోరం ఏవిధంగా ఉపయోగపడుతుంది?
విద్యార్ధులకి ఇమ్మిగ్రేషన్ విషయాల మీద మార్గదర్శికత అవసరం ఉంది. ఇంకొక ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది జనేత కంచర్ల విద్యార్ధులకి ఇమ్మిగ్రేషన్ తదుపరి వారి ఉద్యోగపరమైన వీసాల గురించి జూలై 4వ తేదిలో జరుగనున్న వేదికలో చర్చిస్తారు
 
4) ఇమ్మిగ్రేషన్ విషయాల మీద, సందేహాలకు సంప్రదించడానికి చాలామంది న్యాయవాదులు ఉన్నారు. ఐతే వీరిని సంప్రదించడానికి ఒక సాధారణ ఉద్యోగికి, విద్యార్ధులకు చాలా ఖర్చుతో కూడిన పని. తానా ఇమ్మిగ్రేషన్ విభాగంలో పాల్గొనడానికి ప్రత్యేక రుసుము చెల్లించాలా ?
తానా మహాసభలకు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక ఇమ్మిగ్రేషన్ వేదికలో పాల్గొనడానికి ఏవిధమైన రుసుము చెల్లించక్కరలేదు. పైగా తానా కార్యవర్గం విద్యార్థులకి ప్రత్యేక ప్రవేశ రుసుము ఏర్పాటు చేసింది. విద్యార్ధులు వారి స్టూడెంట్ గుర్తింపు కార్డు చూపించి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
 
5) తానా ఇమ్మిగ్రేషన్ ఫోరంలో అమెరికాలో ఉన్న అత్యుత్తమ న్యాయవాదులు వస్తున్నారని విన్నాం? వారి గురించి వివరంగా చెప్తారా?
డిట్రాయిట్లో జరిగే 20వ తానా మహాసభలలో డిట్రాయిట్లో నివశిస్తున్న ప్రముఖ న్యాయవాదులు రాజగురు నల్లాయ, జోటాల్బోట్ అలాగే అమెరికాలో ప్రముఖ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తి ఈ ఇమ్మిగ్రేషన్ వేదికలో పాల్గొంటారు.  వీరికి ఇమ్మిగ్రేషన్ చట్టంలో అపారమైన అనుభవం ఉంది. ఈ వేదికలో పాల్గొని మీరు మీ ప్రశ్నలకు జవాబులు ఉచితంగా తెలుసుకోవచ్చు.
 
6) తానా ఇమ్మిగ్రేషన్ ఫోరం వల్ల భారతదేశంలో ఉన్న చాలమందికి ఒక అవగాహన వస్తుంది. అయితే ఈ ఫోరంలో చర్చించిన విషయాలు గురించి, న్యాయవాదుల సూచనల గురించి వినాలంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తుందా?
ఈ వేదికలో చర్చించిన విషయాలు, వాటి కార్యక్రమాలు వీడియోలో రికార్డు చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ వీడియోను తానా websiteలో ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నాం.
 
7) తానా ఇమ్మిగ్రేషన్ విభాగం ఒక ప్రత్యేకమైన విభాగం. ఎప్పుడైన ఎవరికైనా తగిన సలహాలు కావాలంటే ఎవరిని సంప్రదించాలి? 
ఈ కమిటీ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు, సంప్రదింపులకి మరియు సలహాలకి తానా ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఉన్న ఎవరినైనా సంప్రదించవచ్చు. మరికొంత ఇన్ఫర్మేషన్ గురించిo  tana2015.org/committee/immigration-forum-committee లో వివరాలు చూడవచ్చు.