ఆషాఢ అమావాస్య.. పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మరిచిపోతే?

karthika snanam
Last Updated: మంగళవారం, 30 జులై 2019 (19:05 IST)
కృష్ణ పక్షంలో వచ్చే బుధవారం పూట (జూలై 31, 2019) వస్తోంది. ఈ రోజున పితృదేవతలకు తర్పణం వదలటం మంచి ఫలితాలను ఇస్తుంది. దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ మాసమైన ఆషాఢంలో భూమాత అమ్మవారిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 
 
ఈ మాసాన్ని అమ్మవారి మాసంగా కీర్తిస్తుంటారు. ఇంకా ఆషాఢ అమావాస్య రోజున శుభకార్యాలను ప్రారంభించవచ్చు. అమావాస్య రోజు నుంచి చంద్రుడు తన పూర్తి రూపాన్ని మెల్ల మెల్లగా మార్చుకుంటాడు. అందుచేత అమావాస్య నుంచి చంద్రుడు రోజు రోజుకు తెలుపు రంగును సంతరించుకోవడాన్నే కృష్ణపక్షం అంటున్నారు. 
 
ఇంకా ఆషాఢ మాసం అన్నపూర్ణమ్మకు ప్రీతికరమైన రోజు. అందుచేత ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని విశ్వాసం. ఆషాఢ మాసంలో శుభకార్యాలను పక్కనబెట్టడం చేస్తుంటాం. కానీ ఆషాఢ అమావాస్య రోజున ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. ఈ రోజున పితృలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా సిద్ధులు, మహర్షుల అనుగ్రహం కూడా సిద్ధిస్తుందట. 
Karthika
 
ఆషాఢ అమావాస్య రోజున నదీ తీరాన లేకుంటే సముద్ర తీరంలో పితృదేవుళ్లకు పిండప్రదానం చేయడం ద్వారా.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇంకా కుటుంబంలో సుభీష్టాలు చేకూరుతాయని పండితులు సూచిస్తున్నారు. కానీ పితృదేవతలకు తర్పణం ఇవ్వడం మరిచిపోతే మాత్రం ఈతిబాధలు తప్పవని వారు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :