బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : గురువారం, 18 జులై 2019 (14:53 IST)

ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం పూట ఇలా చేస్తే?

నవగ్రహాల్లో కుజ గ్రహంతో కుమార స్వామికి సంబంధం వుంది. అందుకే భూమికి కుజ గ్రహానికి, కుమార స్వామికి సంబంధం వుంది. అందుకే కుజ గ్రహానికి సంతృప్తిపరిచినా.. భూమిని పూజించినా కుమార స్వామి సంతృప్తి చెందుతాడు. అందుకే మంగళవారం పూట వ్రతమాచరించి.. కుమారస్వామిని పూజించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. 
 
ముఖ్యంగా ఆషాఢ మంగళవారాల్లో కుమారస్వామి ఆలయాలకు వెళ్లి రాత్రి బస చేయడం ద్వారా.. అభిషేకాలు చేయించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఈతిబాధలు తొలగిపోతాయి. ఆషాఢ మంగళవారం కుమార స్వామి నిష్ఠతో పూజించాలి. ఇంకా ఇంటిల్లిపాదిని శుభ్రం చేసుకుని.. రంగ వల్లికలతో అలంకరించుకుని.. పూజగదిలో దీపాలు వెలిగించాలి.
 
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రాన్ని పఠించాలి. పాలతో చేసిన పాయసం, చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ముత్తైదువులకు, బాలికలకు వాయనం ఇవ్వాలి. ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం కుమార స్వామిని నిష్ఠతో పూజిస్తే.. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మాంగల్య భాగ్యం సిద్ధిస్తుంది. సంతాన ప్రాప్తి చేకూరుతుంది.