బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (17:16 IST)

బుధవారం నరసింహ స్వామినే ఎందుకు పూజించాలి?

ఏడు వారాల్లో ఏ దేవతకు పూజ చేయాలో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవండి. ఆదివారం వ్రతమాచరించడం ద్వారా అనారోగ్య సమస్యలు, వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఆదివారం సూర్యునిని పూజించడం ద్వారా ఆయుర్దాయం, ఆరోగ్యం పెరుగుతుంది. 
 
సోమవారం వ్రతమాచరించడం ద్వారా కుటుంబ కలహాలు తొలగిపోతాయి. కుటుంబంలో ఐక్యత నెలకొంటుంది. ప్రశాంతత చోటుచేసుకుంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. 
 
మంగళవారం వ్రతమాచరించేవారికి కుటుంబంలో ఏర్పడిన విబేధాలు తొలగిపోతాయి. కుజదోషాలు తొలగిపోతాయి. మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. 
 
బుధవారం వ్రతమాచరించడం ద్వారా.. విష్ణుమూర్తిని పూజించడం ద్వారా బుద్ధి వికాసం, వాక్చాతుర్యత పెంపొందుతుంది. బుధవారం నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆయనకు పానకం, వడపప్పు సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు వుంటాయి. వ్యాధులు దూరమవుతాయి. 
 
గురువారం వ్రతమాచరించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. గురువారం నవగ్రహాల్లో ఒకరైన గురు భగవానునికి అర్చన చేయడం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆయనకు శెనగల మాలను సమర్పించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
శుక్రవారం పూట అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. శివాలయంలోని అమ్మవారికి పూజ చేసి, పాయసం, వడలను నైవేద్యంగా సమర్పించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం వ్రతమాచరించడం ద్వారా దంపతుల ఆయుర్దాయం పెరుగుతుంది. దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
శనివారానికి శనీశ్వరుడు అధిపతి. అందుచేత శనివారం పూట శివాలయంలోని శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించారు. శనివారం హనుమంతునికి నేతి దీపం వెలిగించవచ్చు. నారాయణునికి తులసీమాలను శనివారం సమర్పించే వారికి ఈతిబాధలంటూ వుండవని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.