గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (11:03 IST)

మిరియాల పొడి, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

వేసవికాలంలో శరీరం డీహైడ్రేట్ అవడం వలన పెదాలు ఎండిపోతుంటాయి. ఆ పగుళ్లపై నెయ్యి లేదా వెన్న రాస్తే పెదాలు మృదువుగా ఉంటాయి. మెరుస్తాయి. కూడా. ఇక ముఖం మీద ముడతలు, కళ్లకింద నల్లటి వలయాలు పోవాలంటే పసుపులో కొద్దిగా మజ్జిగ, చెరుకు రసం వేసి మెత్తటి పేస్ట్‌లా చేసి నిత్యం ముఖంపై, కళ్లకింద రాసుకుంటే నల్లటి వలయాలు పోతాయి. ఇక చర్మం ముడతలు పడదు. 
 
పసుపు రాసుకుంటే చర్మంపై ఏర్పడే యాక్నే తగ్గుతుంది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తుంది. జిడ్డు చర్మం గలవారు పసుపులో కొద్దిగా నిమ్మరసం కలిపి స్క్రబ్‌ళా చేసి ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉన్న మృతకణాలు పోతాయి. ఇక అవాంఛనీయ రోమాలను నిరోధించడంలో కూడా పసుపు స్క్రబ్ బాగా పనిచేస్తుంది. 
 
యాంటీ ఏజింగ్ గుణాలు నల్ల మిరియాల్లో ఉన్నాయి. నిత్యం మీ డైట్‌లో మిరియాలు ఉండేట్టు చూసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. మిరియాలను మెత్తగా నూరి అందులో కొద్దిగా పెరుగువేసి ముఖానికి రాసుకోవడం వలన చర్మాన్ని డిటాక్సిఫై అవుతుంది. 
 
తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాల వలన చర్మం మృదువుగా తయారవుతుంది. తేనెను నిత్యం ముఖానికి రాసుకోవడం వలన పొడిచర్మం సమస్యలు తగ్గడమే కాదు ముఖం కాంతివంతమవుతుంది. అన్నిరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఇది చెక్ పెడుతుంది. తేనెలో యాంటీ ఏజింగ్ గుణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణం. తేనెలో మెత్తటి మిరియాల పొడిని కలుపుకుని ముఖానికి నిత్యం రాసుకుంటే చర్మం మరింత మెరుపును సంతరించుకుంటుంది.