బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (08:23 IST)

నవంబర్ 04, 2024- త్రిగ్రాహి యోగం.. కన్యారాశికి అదృష్టమే

Astrology
నవంబర్ 04, 2024- త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ సందర్భంగా కన్యారాశికి అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నారు. 
 
వృశ్చికరాశిలో బుధుడు, శుక్రుడు, చంద్రుడి కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇదే సమయంలో మిథునం, కన్యతో సహా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి. 
 
ముఖ్యంగా కన్యారాశి వారికి రోజువారీ అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బు లభిస్తుంది. పిల్లల తరపున కొన్ని కొత్త పనులు చేయడం ద్వారా సంతోషంగా ఉంటారు. అలాగే కుటుంబ ఖర్చులను నియంత్రించాలి. సోమవారం అనేక విధాలుగా అదృష్టం వరిస్తుంది. కన్యారాశి వారు అన్నదానం చేయడం ద్వారా పాప విముక్తి లభిస్తుంది.
 
కన్యా రాశిలో సూర్యుడు, శుక్రుడు, కేతువు కలయిక వల్ల తులా రాశి వారికి అద్భుత ప్రయోజనాలు రానున్నాయి. ఈ కాలంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.
 
ఇక ధనుస్సు రాశి వారికి ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది.  సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి.
 
ఇక సింహ రాశి వారికి మూడు గ్రహాల కలయిక వల్ల ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ కాలంలో మీ ఆందోళనలన్నీ తొలగిపోతాయి.
 
కన్యా రాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల మేషరాశి వారు అన్ని రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ కాలంలో మీరు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ ఉన్నతాధికారులు, సహోద్యోగులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు.