వినాయకుడికి శెనగల మాల సమర్పిస్తే..?
నవగ్రహాలలో గురుభగవానునికి చెందిన ధాన్యం శెనగలు. అందుకే శెనగల మాలను గురుభగవానుడికి సమర్పిస్తారు. గురుదేవునికి శెనగలు ఎలా ధాన్యమో, శని దేవుడికి నువ్వులు ధాన్యం. శెనగలను మాలగా గురువుకు సమర్పిస్తే సర్వశుభాలు చేకూరుతాయి.
ధాన్యాలు మనకు భగవంతుడిచ్చిన వరం. ఈ ధాన్యాలతో ఆహారాన్ని సిద్ధం చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంపిణీ చేయాలి.
అలాగే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి శెనగలతో చేసిన వంటకాలను సమర్పిస్తే. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అదీ గురువారం వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి శెనగల మాల సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.