సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (15:59 IST)

05-09-2019- గురువారం దినఫలాలు - ఆదాయ వ్యయాలు మీ స్తోమతకు..

మేషం: ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ ప్రశాంతత మీ చేతుల్లోనే ఉందని గమనించండి. ఆదాయ వ్యయాలు మీ స్తోమతకు తగినట్టుగానే ఉంటాయి. మీ ఆలోచనలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి.
 
వృషభం: కొన్ని విషయాల్లో నిగూఢంగా ఉండండి. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల అనర్థాలు తప్పవు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. విదేశాలు వెళ్ళలనే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు.
 
మిధునం: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తిన తెలివితో పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. సంఘంలో పలుకుబడికలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది.
 
కర్కాటకం: మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గ్రహించండి. బంధువులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు.
 
సింహం: మీరు కోరుకునే మార్పులు నిదానంగా అనుకూలిస్తాయి. ప్రభుత్వ రంగంలో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాదు. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. ఇతరుల గురించి అనాలోచితంగా చేసిన వ్యాఖ్యానాలు సమస్యలకు దారితీయవచ్చు జాగ్రత్త వహించండి.
 
కన్య: బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహిస్తారు. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృ్ద్ధి కానవస్తుంది. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు. నిరుద్యోగులు అవకాశాలను అందిపుచ్చుకోవడం ఉత్తమం.
 
తుల: దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వృత్తుల్లో వారికి ప్రోత్సాహకరం. మార్కెటింగ్, ఉద్యోగాలకు టార్గెట్ పూర్తి అవ్వడం కష్టతరమవుతుంది. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. 
 
వృశ్చికం: వ్యాపారలావాదేవీలు ఊపందుకుంటాయి. దైవసేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. నూతన ఎగ్రిమెంట్లు వాయిదా పడటం మంచిది. స్త్రీల ఆడంబరాలను చూసి ఎదుటివారు అపోహపడతారు. క్రీడా, కళా రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి.
 
ధనస్సు: స్త్రీలు శారీరక మానసిక వేదనకు గురవుతారు. వృత్తి, ఉద్యోగాల యందు మంచి గుర్తింపు లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకం. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. శ్రమానంతరం మీరు కోరుకున్న ప్రాజెక్టులను దక్కించుకుంటారు. బ్యాంకు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. 
 
మకరం: ఉద్యోగస్తులు ఎదుటివారి తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. వృత్తిరీత్యా మీ బాధ్యతలు పెరుగుతాయి. దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
కుంభం: సన్నిహితుల మధ్య విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి. సోదరి, సోదరుల పోరు అధికంగా ఉంటుంది. మీలో సృజనాత్మకత మేల్కొంటుంది. ఒక విషయంలో ఆప్తుల సలహా పాటించనందుకు పశ్చాత్తాపం చెందుతారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభించే ఆస్కారం ఉంది.
 
మీనం: మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొన్ని పనులు సాధిస్తారు. పత్రికా, మీడియా రంగాల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక, దైవ సేవాకార్యక్రమాలకు ఖర్చులు అధికంగా వెచ్చిస్తారు. కాంట్రాక్టర్లకు బిల్డర్లకు ఒత్తిడి, పనిభారం అధికం. విద్యార్థులలో ఉత్సాహం, చురుకుదనం కానవస్తుంది. రుణాలు తీరుస్తారు.