సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

10-11-2019 ఆదివారం మీ రాశి ఫలితాలు

ఆదిత్య హృదయం చదివినా లేక విన్నా శుభం కలుగుతుంది. 
 








మేషం: మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాక వల్ల మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత తప్పదు.
 
వృషభం : ఆర్థిక లావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వస్త్ర, బంగారం, వెండి లోహ, వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబీకులతో అవగాహన లోపిస్తుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. రాజకీయనాయకులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మిథునం: రిప్రజెంటివ్‌లకు, ప్రైవేట్ సంస్థల్లో వారికి శ్రమాధిక్యత కానవచ్చిన సంతృప్తి కానరాగలదు. పాత మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులు క్రీడలు పట్ల ఆసక్తి కనబరుస్తారు. కార్యసాధనలో ఒడిదుడుకులు అధికమిస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. సాహస ప్రయత్నాలు విరమించండి.
 
కర్కాటకం: పత్రిక, వార్తా సంస్థల్లోని ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. వృత్తి స్థానంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆశించినంత చురుకుగా సాగవు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. విద్యార్థులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు చికాకు తప్పదు. ఒక స్థిరాస్తి కొనుగోలు చేయాలనే ఆలోచన బలపడుతుంది.
 
సింహం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ప్రణాళికలు మునుముందు మంచి ఫలితాలనిస్తాయి. స్త్రీల మనోభావా లకు మంచి స్ఫురణ లభిస్తుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా వుండటం మంచిది.
 
కన్య: మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సంతానం పై చదువుల విషయం వారి ఇష్టానికే వదిలేయటం మంచిది కాదు. దంపతుల మధ్య ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితులు ఒక వ్యవహారంలో మిమ్ములను ఒత్తిడికి గురి చేస్తారు. గృహానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
తుల: ఆర్థిక లావాదేవీలు, వాణిజ్య ఒప్పందాల్లో కచ్చితంగా వ్యవహరించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సోదరీ సోదరుల గురించి ఒక రహస్యం తెలుసుకుంటారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సి వుంటుంది. 
 
వృశ్చికం: మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కుటుంబీకుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి. నూతన పరిచయాలు మీ ఉన్నతికి, పురోభివృద్ధికి తోడ్పడుతాయి. మీ రాబడికి తగినట్లుగా ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. మీ నిర్ణయాలు, కార్యక్రమాల్లో స్వల్ప మార్పులుంటాయి. 
 
ధనస్సు: చిన్న పొరపాటే పెద్ద సమస్యకు దారితీసే ఆస్కారం వుంది. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదు. కార్యసాధనలో ఓర్పు, విజ్ఞతతతో వ్యవహరించవలసి వుంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
 
మకరం: ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం అంతగా ఉండదు. ఇతరులపై ఆధారపడటం మంచిది కాదని గమనించండి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది. 
 
కుంభం: స్త్రీలకు తమ మాటే నెగ్గాలనే పంతం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు లభించినప్పటికీ వాటి సద్వినియోగం చేసుకోలేరు. వృత్తి రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. కుటుంబ విషయాల్లో మీ ఆధిపత్యం కొనసాగుతుంది. మిమ్ములను కాదన్న వారే మీకు చేరువ కావటానికి యత్నిస్తారు.
 
మీనం: ఇంట్లో మార్పులు, చేర్పులు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. చెప్పుడు మాటలకు  ప్రాధాన్యత ఇవ్వడం మంచిది కాదు. రుణాలు తీరుస్తారు. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది.