శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 11 మార్చి 2020 (16:55 IST)

11-03-2020 బుధవారం మీ రాశిఫలాలు - మహావిష్ణువును ఆరాధించినా...

మేషం : దైవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. ఆధ్యాపకులకు పురోభివృద్ధి. ఆకస్మిక ప్రయాణాలు వాయిదాపడతాయి. దంపతుల మధ్య అకారణంగా కలహం, పట్టింపులు అధికమవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
వృషభం : మీ కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకువ వహించండి. ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టుల వ్యవహారాల్లో పునరాలోచన అవసరం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. 
 
మిథునం : స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. రాజకీయాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
కర్కాటకం : వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. లీజు, ఏజెన్సీల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, శ్రమాధిక్యత అధికమవుతాయి. వాహనంపై దూర ప్రయాణాలు మంచిదికాదు. 
 
సింహం : వస్త్ర, బంగారు, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రైవేటు సంస్థలలోని వారికి లౌక్యం అవసరం. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థుల వల్ల సమస్యలు తప్పవు. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. 
 
కన్య : ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. స్త్రీలలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రేమికులకు తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. చేపట్టిన పనులు వాయిదాపడతాయి. పాతమిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. 
 
తుల : ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. రాజకీయ, కళా రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. కంది, మిర్చి, పసుపు, ధాన్యం అపరాల స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ వాక్‌చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృశ్చికం : ప్రభుత్వం నందు పనిచేయు ఉద్యోగలకు లాభములు చేకూరును. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. శతృవులపై విజయం సాధిస్తారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. 
 
ధనస్సు : ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు అధికమవుతాయి. ప్రముఖుల కలయిక వల్ల సాధ్యపడదు. రాజకీయ కళా రంగాల్లో వారికి కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు పనివారలతో సమస్యలు అధికమవుతాయి. ప్రియతముల రాక కోసం ధనం బాగా వెచ్చిస్తారు. కోర్టు పనులు వాయిదా వేయడం మంచిదని గమనించండి. 
 
మకరం : శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. బహిరంగ సభలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు వెనుకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు. కుటుంబీకుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయ నాయకులకు కలిసివచ్చును. బ్యాంకు పనుల్లో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. 
 
కుంభం : కళలు, ఫోటోగ్రఫీ, ఉన్నత విద్య రంగాల వారికి అనుకూలమైన సమయం. కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ, తినుబండరాల వ్యాపారులకు లాభం. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సాహిత్యవేత్తలకు ప్రత్యేక గుర్తింపు లభించును. స్త్రీలు ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించడం మంచిది. 
 
మీనం : ప్రైవేటు సంస్థలలోని వారికి లౌక్యం అవసం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో సంభాషించునపుడు మెళకువ చాలా అవసరం. రుణాలు తీర్చడానికే చేయు యత్నాలు ఫలిస్తాయి. హోటల్, తినుబండరాలు, కేటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది.