29-05-2016 నుంచి 04-06-2016 వరకూ మీ రాశి ఫలితాలు....

మేషం: గృహ మార్పు సత్ఫలితానిస్తుంది. పనులు వేగమంతమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మంగళ, బుధవారాల్లో ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటా

Raman| Last Modified శనివారం, 28 మే 2016 (15:13 IST)
మేషం: గృహ మార్పు సత్ఫలితానిస్తుంది. పనులు వేగమంతమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మంగళ, బుధవారాల్లో ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. గృహమార్పు కలిసివస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వూలు నిరుత్సాహపరుస్తాయి. ఆశాదృకృథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులు కొత్త బాద్యతలు స్వీకరిస్తారు. అధికారులకు హోదా మారు, బదలీ ఉత్తర్వులు అందుతాయి. కార్యసిద్ధికి ఆంజనేయస్వామికి గారెల నైవేద్యం సమర్పించండి.
 
వృషభం: దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ మాటకు స్పందన లభిస్తుంది. యత్నాలకు అవకాశాలు కలిసివస్తాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. గురు, శుక్రవారాలలో ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వాయిదా పడిన పనులను పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త, మీపై శునకాల ప్రభావం అధికం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి పురోభివృద్ధి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. చిరువ్యాపారాలు ఊపందుకుంటాయి. లీజు, ఏజెన్సీలకు అనుకూలం, దాసాంజనేయస్వామికి తమలపాకులతో అర్చన శుభం, జయం.
 
మిధునం: ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ప్రతి విషయంలోను ఆచితూచి అడుగేయాలి. కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచాలి. పనులు హడావిడిగా సాగుతాయి. విమర్శలు, పట్టింపులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆదాయానికి తగినట్టుగా ఖర్చులుంటాయి. రావలసిన ధనంలో కొంతమొత్తం అందుతుంది. శనివారం నాడు పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బందులు కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. అధికారులకు పర్యటనలు ఒత్తిడి, విశ్రాంతిలోపం. ఉద్యోగ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు సంతృప్తికరంగా సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను అధిగమిస్తారు. ఈ రాశివారికి హనుమాన్ చాలీసా పారాయణం శుభదాయకం.
 
కర్కాటకం: వివాదాలు సామర్యంగా పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడుతారు. బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపడి హామీలివ్వవద్దు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో రాణిస్తారు. ఉద్యోగస్తులకు పర్యటనలు, ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం, అధికారులకు సాదర వీడ్కోలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారాలు, స్టాకిస్టులకు పురోభివృద్ధి ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. 
 
సింహం: ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. అవసరాలు, కోరికలు నెరవేరగలవు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచన చేస్తారు. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. శుభకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఆది, సోమవారాల్లో పనులు, బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. ప్రకటనల పట్ల అవగాహన అవసరం. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. కొంతమంది మీ ఆలోచనలు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వ్యాపారాల విస్తరణకు, ప్రాజెక్టులు, పరిశ్రమలకు అనుకూలం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. ఉద్యోగస్తులు గుట్టుగా యత్నాలు సాగించాలి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. 
 
కన్య: మనోధైర్యంతో ముందుకు సాగండి. త్వరలో శుభవార్త వింటారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ధనవ్యయం విపరీతం. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో అందిన సమాచారం ఆలోచింపజేస్తుంది. మీ శ్రీమతితో విభేదిస్తారు. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వృత్తులు, క్యాటరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, ఒత్తిడి విశ్రాంతి లోపం. అధికారులకు ధన ప్రలోభం తగదు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
తుల: ఆలోచనలు పథకాలు కార్యరూపం దాల్చుతాయి. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. వస్తువులు, నగదు జాగ్రత్త. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. గురు, శుక్రవారాల్లో మీపై శకునాల ప్రభావం అధికం. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. హోదా పెరిగే సూచనలున్నాయి. ప్రశంసలు అందుకుంటారు. వృత్తుల వారికి అవకాశాలు కలిసివస్తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు అధికం. అవసరాలకు ధనం అందుతుంది. దస్త్రం వేడుకకు ముహుర్తం నిశ్చయమవుతుంది. నూతన పెట్టుబడులు, లీజు, ఏజెన్సీలు, టెండర్లకు అనుకూలిస్తాయి. చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు. వివాదాలు పరిష్కారమవుతాయి. సాంకేతి రంగాల వారికి ప్రోత్సాహకరం. 
 
వృశ్చికం: ఆత్మీయుల సాయంతో ఒక సమస్య నుంచి బయటపడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కలిసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గుట్టుగా యత్నాలు సాగించాలి. శనివారంనాడు ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. ప్రైవేట్ సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీ పథకాలు మున్ముందు సత్ఫలితాలినిస్తాయి. సెన్సెక్స్ నష్టాల బాటలో సాగుతుంది. 
 
ధనుస్సు: శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. పనులు వేగవంతమవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. ఆది, సోమవారాల్లో చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ, ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. పొగడ్తలు, మొహమ్మాటాలకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. అయిన వారికి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండబోవు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రదానం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
మకరం: అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. మంగళ, బుధవారాల్లో తొందరపడి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఆహ్వానాలు, నోటీసులు అందుతాయి. ప్రయత్నాలు ప్రోత్సహాకరంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అంచనాలను మించుతారు. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. అనుకోకుండా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉద్యోగస్తులకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. మందలింపులు తప్పవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం, వేడుకలకు ముహుర్తం నిశ్చయమవుతుంది. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
కుంభం: నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. హోల్‌సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. నిర్ధిష్ట ప్రణాళికలతో యత్నాలు కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కుదుటపడుతారు. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, గురువారాల్లో పనులు సానుకూలంగా శ్రమిస్తారు పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ఉద్యోగస్తుల కార్యక్రమాలకు ప్రశాంతగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రయాణం తలపెడతారు. 
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. అసాధ్యమనుకున్నుపనులు తేలికగా పూర్తి కాగలవు. ఆందోళన తొలగుతుంది. వ్యవహార ఒప్పందాలలో ఏకాగ్రత వహించండి. చెల్లింపులు, చెక్కుల జారీలో జాగ్రత్త. ఆది, సోమవారాలలో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడుతయి. ఖర్చులు అధికం. అవసరాలకు అతికష్టం మీద ధనం సర్దుబాటవుతుంది. నమ్మిన వారే తప్పుదారి పట్టించే యత్నం చేస్తారు. వృత్తిృ ఉపాధి పథకాలు, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. ఫైనన్స్, చిట్స్ వ్యాపారుకు సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పనిభారం, విశ్రాంతి లోపం. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతతకు ఆంజనేయస్వామికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించండి.దీనిపై మరింత చదవండి :