గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 జులై 2020 (19:11 IST)

ఐదు సోమవారాలు.. తూర్పు వైపు నేతితో దీపమెలిగిస్తే? (Video)

గురు పౌర్ణమి ఆదివారం (జూలై-5) ముగిసిన నేపథ్యంలో శ్రావణ్ అనే శవన (ఉత్తరాదిన అలా పిలుస్తారు) మాసం సోమవారం ప్రారంభమైంది. ఈ శ్రవణ్ మాసంలో వచ్చే తొలి సోమవారానికి ప్రాశస్త్యం వుంది. చాతుర్మాస దీక్ష ఇప్పటికే ప్రారంభమైంది. ఈ మాసంలోని సోమవారాలకు విశేష ఫలితాలున్నాయి. 
 
అందుకే శ్రావణ్ అనే పిలువబడే మాసంలో వచ్చిన తొలి సోమవారంలో నిష్ఠతో వ్రతమాచరించే వారికి సకల శుభాలు చేకూరుతాయి. ఈ రోజున శివపార్వతులను పూజించాలి. ఈ మాసంలో వచ్చే ఐదు సోమవారాలు ఉపవసించి.. ఉమామహేశ్వరులను పూజించాలి. ఈ రోజున సముద్ర స్నానం లేదంటే పుణ్య తీర్థంలో స్నానమాచరించి.. శివునిని పూజించాలి. 
 
జూలై 6- తొలి శ్రావణ్ సోమవారం 
జూలై 13 - రెండో శ్రావణ్ సోమవారం 
జూలై 20- మూడో శ్రావణ్ సోమవారం 
జూలై 27 - నాలుగో శ్రావణ్ సోమవారం 
ఆగస్టు 3- ఐదో సోమవారం 
 
పురాణ కథల ఆధారంగా సముద్ర మథనంలో పాల్గొన్న సమయంలో అందులో నుంచి పుట్టిన విషాన్ని శివుడు తాగడం జరిగింది. అయితే ఈ విషాన్ని తాగవద్దని పార్వతీ దేవి కంఠాన్ని అడ్డగించడంతో ఆ విషం ఈశ్వరుని కంఠంలోనే నిలిచిపోయిందని తద్వారా ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చిందని చెప్తారు. హాలహాల విషాన్ని తాగి లోకాన్ని రక్షించిన నీలకంఠునికి కృతజ్ఞతతో, ​​శివుడి కంఠాన్ని నయం చేయడానికి ప్రజలు పవిత్ర గంగా నది నుండి నీటిని అందిస్తారని విశ్వాసం. 
 
సోమవార వ్రతం ప్రాముఖ్యత ఏంటంటే?
హిందూ వేదాలు, పురాణాల ప్రకారం.. సోమవారం శివపూజ ద్వారా అనుకున్న కార్యాల్లో విజయం చేకూరుతుంది. వివాహ అడ్డంకులు తొలిగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున ఉపవసించే వారికి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. పెళ్లి కాని యువతులకు మంచి భర్త కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. 
 
అలా సోమవారంలో శివ చాలీసాను పఠించాలి. తూర్పు దిశలో నేతితో దీపమెలిగించాలి. ఈ మాసంలో మద్యపానం సేవించడం కూడదు. మాంసాహారం ముట్టుకోకూడదు. వంకాయలను తీసుకోకూడదు. శివలింగానికి పాలతో అభిషేకం చేయించాలి. సూర్యోదయానికి ముందే శివపూజ చేయాలి. అయితే సోమవారం శివునికి పసుపుతో అభిషేకం చేయకూడదు. ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.