బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (10:16 IST)

ఏ రాశుల వారికి శుక్రవారం అదృష్టాన్నిస్తుందో తెలుసా? (video)

శుక్రవారం శుభాలను ఇచ్చే రోజు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి అనుగ్రహం కోసం పూజ చేస్తుంటాం. అలాగే ముగ్గురమ్మల కోసం అర్చనలు, అభిషేకాలు, పూజలు చేస్తూ వుంటాం. ఈ రోజుకు శుక్రుడు అధిదేవత. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు శుక్రవారాలను నియమిస్తాడు. 
 
ఉత్సాహం, సంతృప్తి, ఆనందం, సుఖసంతోషాలకు ఆయనే కారకుడు. అలాగే శుభసూచకాలుగా చెప్తున్న హంసలు, పిచ్చుకలు, పావురాలు శుక్రుడికి పవిత్రమైనవి. అందుకే శుక్రవారం పూట తీపి పదార్థాలను పక్షులకు పెట్టడం చేస్తే శుక్రుని అనుగ్రహంతో ఈతిబాధలను తొలగించుకుని.. సుఖ సంతోషాలను పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
Taurus
 
అలాగే రాశుల్లో శుక్ర గ్రహానికి, శుక్రవారానికి వృషభం, తులతో ముడిపడి ఉంది. వృషభ రాశి జాతకులకు శుక్రవారం అమితమైన అదృష్టాన్నిస్తుంది. అందుకే ఈ రాశుల వారు శుక్రవారం పూట ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చు. శుక్రుడు పాలించే శుక్రవారం రోజున వృషభ రాశి జాతకులు శుక్రునికి ప్రీతికరమైన పనులు చేయడం మంచిది.
 
శుక్రవారం తుల, వృషభ రాశులు చేయాల్సిన పనులు.. 
ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చు
స్నేహితులతో హాయిగా గడుపవచ్చు
ప్రేమను వ్యక్త పరుచవచ్చు. 
 
పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు
విలువైన సమయాన్ని కుటుంబంతో గడుపవచ్చు.. 
గృహాలంకరణ చేపట్టవచ్చు. 
ఇతరులకు సాయం చేయడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చు. 
వ్యక్తిత్వ వికాసానికి కార్యాచరణ చేపట్టడం, 
 
ఇంటి వంటగదిని అందంగా తీర్చిదిద్దండి.. 
లోపాలను మార్చేందుకు ముందడుగు వేయడం చేయొచ్చు. 
జలపాతాలు, సముద్ర తీరాలను సందర్శించడం చేయొచ్చు. 
Libra
 
అదృష్టాన్నిచ్చే రంగులు.. 
తుల, వృషభ రాశి జాతకులు జాతిపచ్చ రంగు రత్నాలు, నీలి రంగు పొదిగిన వజ్రపు వుంగరాలు ధరించడం మంచిది. వీటితో పాటు పచ్చరంగు దుస్తులు, లేత ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచి ఫలితాలను ఇస్తుంది. రోజా, మల్లె పువ్వులను ఇష్ట దేవతార్చనకు వాడటం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.