సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (15:37 IST)

కుజ దోషం వున్న జాతకులు ఏం చేయాలో తెలుసా? (video)

కుజదోషం వున్న జాతకులు కుమారస్వామిని పూజించడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. కుమారస్వామి యుద్ధంలో తారకాసురుడు, సూరపద్ముడు, సింగముఖాసురులను వధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే కుజదోషం వున్న జాతకులు కుమార స్వామిని పూజించడం ద్వారా ఆ దోష ఫలితాలు తగ్గుతాయి. రోజు ఉదయం స్నానానికి అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించాలి. 
 
ఇలా చేయడం ద్వారా కుజ దోషం తొలగి శుభఫలితాలుంటాయి. కుమార స్వామి ఐదు హస్తాలలో ఆరు ఆయుధాలుంటాయి. స్కంధ పురాణంలో సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని రోజు ప్రతిరోజూ పఠిస్తే. పాపాలన్నీ తొలగిపోతాయి. కుజ దోషాలు నివృత్తి అవుతాయి. కుమార స్వామిని స్తుతించి రోజు షష్ఠి, విశాఖ, కార్తీక నక్షత్రాల రోజుల్లో, సోమ, మంగళ రోజుల్లో పూజిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
కుమార స్వామికి గంగాదేవి పుత్రుడు కావున కాంగేయుడని, శరవణభవ, కార్తీకేయుడు అనే పేర్లున్నాయి. ఆయన చేతులో వున్న వేలాయుధం జ్ఞానశక్తికి ప్రతీక. అందుకే ఆయన్ని పూజించడం ద్వారా సంపూర్ణ జ్ఞానం చేకూరుతుంది. ఈతిబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కుజ దోషాలే కాకుండా నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.