శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : గురువారం, 3 జనవరి 2019 (12:39 IST)

శివానుగ్రహం కోసం.. ఈ వ్రతాలు ఆచరిస్తే..?

శివుని అనుగ్రహం కోసం శైవక్షేత్రాలను సందర్శించుకోవడం ఉత్తమ మార్గం. ప్రదోష కాలంలో పరమేశ్వరుని దర్శించుకోవడం సత్ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో నందీశ్వరాభిషేకం, శివలింగాభిషేకాన్ని కళ్లారా వీక్షించే వారికి కార్యసిద్ధి.

ఇలా శనిప్రదోష సమయంలో ఈశ్వరుని దర్శించుకునేవారికి ఐదేళ్ల పాటు ఆలయాన్ని దర్శించుకున్న ఫలితం లభిస్తుందని విశ్వాసం. శివుని అనుగ్రహం కోసం శైవులు 8 రకాలైన వ్రతాలను ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాలను ఆచరించిన వారికి ఈశ్వరుని అనుగ్రహం తప్పకుండా చేకూరుతుంది.  
 
అవేంటంటే..? 
1. సోమవారం వ్రతం - ప్రతి సోమవారం శివునిని ధ్యానించడం, పూజించడం.. 
2. ఉమా మహేశ్వర వ్రతం - పౌర్ణమి రోజున ఆచరించే వ్రతం 
3. ఆరుద్ర వ్రతం - ధనుర్మాసంలో ఆచరించే వ్రతం
4. శివరాత్రి వ్రతం
5. కళ్యాణ వ్రతం - పాల్గుణ మాసం, ఉత్తర నక్షత్రం రోజున ఆచరించేది. 
6. పాశుపత వ్రతం 
7. అష్టమి వ్రతం - వైశాఖ పూర్వాభాద్ర అష్టమి రోజున ఆచరించాలి. 
8. కేదార గౌరీ వ్రతం - దీపావళి రోజున ఆచరించే వ్రతం.