గృహ నిర్మాణానికి.. దిక్కులు - మూలలు..?
ఇల్లు కట్టుకునే ముందు ఏ స్థలంలో ఇల్లు కట్టదలిచారో, ఆ స్థలానికి దిక్కులు, మూలలు సరిగ్గా నిర్ణయించడం, వాస్తు శాస్త్రరీత్యా చాలా అవసరం. ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క మూలకు ఓ ప్రత్యేకత ఉన్నది. ఏ ఏ దిశలలో ఏ ఏ గధులు నిర్మించాలో, ఏ ఏ పనులు చేయవచ్చో, దిశల ఎత్తుపల్లాల వలన శుభాశుభ ఫలితాలేమిటో వాస్తు విద్వజ్ఞులు నిర్ణయించారు.. శాస్త్రీయ పద్ధతిలో ఇల్లు కట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇల్లు నిర్మించదల్చుకున్న స్థలంలో.. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాల్లో (నీడను బట్టి) సూత్రం పట్టి తూర్పు పడమరలు నిర్ణయించేవారు. నైరుతిదిశలో మూలమట్టం పెట్టి, హెచ్చు తగ్గుల్లేనిరీతిలో అమర్చి దక్షిణం మీదుగా ఆగ్నేయమూల వరకు తాడుకట్టి లాగాలి. అట్లే నైరుతి నుండి పడమర మీదుగా వాయవ్య మూలవరకు తాడుకట్టి లాగాలి.
దీని వలన సరైన రీతిలో దక్షిణ, పశ్చిమదిశలు గుర్తింవచ్చును. అలాగే ఆగ్నేయంలో మూలమట్టం పెట్టి తాడును తూర్పుమీదుగా ఈశాన్యం వరకు లాగాలి. అలాగనే వాయవ్యదిశలో మూలమట్టం ఉంచి, ఉత్తరం మీదుగా ఈశాన్యం వరకు తాడుకట్టి లాగాలి. ఇలా చేయడం వలన తూర్పు, ఉత్తర దిశలు సరైన తీరున గుర్తించవచ్చును.