మొక్కలు పెంచే అలవాటుందా? కలబంద దిష్టి దోషాన్ని తొలగిస్తుందట.. (Video)  
                                       
                  
                  				  మొక్కలు పెంచే అలవాటు చాలా మంచిది. ఇంటి పరిసరాలలో కొన్ని మొక్కలు పెంచడం వలన మనకు అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా సమకూరుతుంది. దైవత్వం ఉన్న ఆ మొక్కలు మరియు వాటి వలన కలిగే ప్రయోజనం గురించి తెలుసుకుందాం. 
	
				  
	 
	తులసి మొక్క చాలా ముఖ్యమైనది. తులసి మొక్కను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఇది చాలా పవిత్రమైనది. ఈ మొక్క పెంచడం వలన అదృష్టంతో పాటు ఆరోగ్యం కూడా. ఇంటి ఇల్లాలు ప్రతిరోజూ తులసి కోటకు పూజ చేస్తే ఆ ఇల్లు సుఖసంతోషాలతో ఉంటుంది. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తి అని అంటారు. ఆ స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. 
				  											
																													
									  
	 
	లక్ష్మి ఉంటే కరువు అనేది ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసికి పూజ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. కలబంద మొక్క ఇంటి ముందు ఉండటం వలన దిష్టి దోషం పోతుంది. నర దిష్టి ఉంటే ముఖ్యమైన కార్యాలకు ఆటంకం కలిగి మనం ఎత్తుకు ఎదగలేము. అందుకే ఈ మొక్కను మన ఇంటి ముందు పెంచితే చాలా మంచిది.