గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (16:35 IST)

ఎనర్జీ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసా?

యువత ఎక్కువగా ఇష్టపడి తాగే ఎనర్జీ డ్రింక్స్‌కి సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెలుగు చూసాయి. సాధారణంగా ఈ డ్రింక్స్ తాగడం వల్ల శరీరానికి అధిక శక్తి వస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అందుకే వీటిని ఎక్కువగా సేవిస్తుంటారు. వీటిని తాగడం వల్ల వచ్చే శక్తిని పక్కనబెడితే వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు 18-40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారిపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ని సేవించిన వారి గుండె స్పందనల్లో తీవ్రమార్పులు చోటు చేసుకున్నట్లు తేలింది. 
 
ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగిన వారి హృదయ స్పందనలు 6 మి.సె నుంచి 7.7 మి.సె ఉంటున్నట్లు గుర్తించారు. ఇది ప్రాణాలకు ముప్పు తీసుకొస్తుంది కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ మానివేయాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.