సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : సోమవారం, 9 జులై 2018 (13:23 IST)

పెళ్లి కుదరట్లేదా.. ఎర్రని పువ్వుల మాలను..?

వివాహానికి అడ్డంకులు తప్పట్లేదా.. పెళ్లి కుదరట్లేదా..? అయితే చక్రతాళ్వార్ స్వామిని పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఎలాగంటే..? సుదర్శన చక్రతాళ్వార్‌ను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.

వివాహానికి అడ్డంకులు తప్పట్లేదా.. పెళ్లి కుదరట్లేదా..? అయితే చక్రతాళ్వార్ స్వామిని పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. ఎలాగంటే..? సుదర్శన చక్రతాళ్వార్‌ను పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయి.

ముఖ్యంగా వివాహానికి అడ్డంకులు ఎదుర్కునేవారు.. చక్రతాళ్వార్ స్వామికి గురువారం లేదా శనివారం ఎర్రని పువ్వులతో మాలను సమర్పించుకుని అర్చన చేయించాలి. నేతితో ప్రమిదలతో దీపమెలిగించాలి. ఇలా చేస్తే వివాహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
సాధారణంగా శివాలయాల్లో మాత్రమే నవగ్రహ ప్రదక్షణ చేస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అయితే వైష్ణవ ఆలయంలో చక్రతాళ్వారును పూజించడం ద్వారా నవగ్రహాలచే ఏర్పడే దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. చక్రతాళ్వార్ సన్నిధిలో నేతితో దీపం వెలిగించి.. ''ఓం నమో భగవతే మహా సుదర్శనాయ నమః'' అనే మంత్రాన్ని జపిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా వివాహ అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం.