శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (13:53 IST)

ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే?

ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. శూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుకూలం కాని మాసం అని అర్థం. ఈ నెలలో చేసే స్నానం, దానం, జప, పారాయణాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢమాసంలోనే దక్షిణాయణ కాలం ప్రారంభమవుతుంది. క

ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారు. శూన్యమాసం అంటే శుభకార్యాలకు అనుకూలం కాని మాసం అని అర్థం. ఈ నెలలో చేసే స్నానం, దానం, జప, పారాయణాలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢమాసంలోనే దక్షిణాయణ కాలం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. 
 
అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనం పితృ దేవతలకు ప్రీతికరమని పండితులు చెప్తున్నారు. ఆషాఢ మాసంలో నుండే చాతుర్మాస దీక్షలు, వ్రతాలు ప్రారంభమవుతాయి. 
 
ఆషాఢ మాసంలో ముత్తైదువులు చేతికి గోరింటాకు పెట్టుకోవాలి. కాళ్లకు చేతులకు గోరింటాకును రాసుకుంటే.. వర్షాకాలంలో ఏర్పడే చర్మ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా ఆషాఢంలో గోరింటాకును చేతికి పెట్టుకుంటే.. ఆ ఇంట సౌభాగ్యానికి లోటుండదని, గోరింటాకు ధరించే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీకగా పరిగణిస్తారు. 
 
ఆషాడంలో గ్రీష్మరుతువు పూర్తి కావడంతో పాటు వర్షరుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది. అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి.. బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. 
 
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పండితులు చెప్తున్నారు.