సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (10:11 IST)

ఆషాఢ పౌర్ణమి నాడు మహాశివుడు రుషులకు సత్యాన్ని..?

Lord shiva
ప్రపంచానికి సత్యాన్ని అందించి, తాత్త్విక జ్ఞానాన్ని బోధించిన మహర్షిగా శివుడు పరిగణించబడ్డాడు. అందుకే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మహాశివుడు నలుగురు రుషులకు సత్యాన్ని బోధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దీనినే గురు పౌర్ణమి అంటారు.
 
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకత వుంది. అదీ గురు పౌర్ణమి అంటే.. విశిష్టతతో కూడుకున్నది. 
 
పరమేశ్వరుడు సత్యం, క్రియ, యోగం, జ్ఞానం అర్థాన్ని రుషులకు వివరించారు. తల్లిదండ్రులు, భగవంతునితో పాటు గురువుకు ప్రాధాన్యత ఇవ్వాలని శివుడే ప్రబోధించాడు. 
 
గురు-శిష్య సంప్రదాయానికి మూలం కూడా ఇదే. గురు ప్రాముఖ్యత దీని ద్వారా వ్యక్తమవుతుంది. స్పష్టం చేశారు. ఎంత నేర్చిన వ్యక్తికైనా మంచి మార్గదర్శకత్వం అవసరం. 
 
రాజ్య పుత్రులు గురుకులానికి వెళ్లి గురువును సేవించాలని, పరిపక్వ స్థితిలో తమ స్వంత విద్యను నేర్చుకోవాలనే నియమం ఉండేదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.