ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (19:46 IST)

ఆషాఢ గుప్త నవరాత్రులు.. వారాహి నవరాత్రులు.. పూజా ఫలితం..?

Varahi Puja
ఆషాఢ గుప్త నవరాత్రి జూన్ 19 (సోమవారం) ప్రారంభమైంది. ఈ రోజున అంటే జూన్ 19న వృద్ధి యోగం ఏర్పడుతోంది. ఉదయం నుంచి అర్థరాత్రి 1.15 నిమిషాల వరకు వృద్ధి యోగం కొనసాగనుంది. ఈ యోగంలో ఏదైనా శుభ కార్యం చేస్తే తప్పకుండా విజయం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఆషాఢ మాసంలోని గుప్త నవరాత్రులలో దుర్గామాతను పది రూపాలుగా పూజిస్తారు. కాళి, తార, చిన్నమస్తా, షోడశి, భువనేశ్వరి, భైరవి, ధూమావతి, బగ్లాముఖి, మాతంగి, కమల అనే ఈ మహా అవతారలను పూజించడం ద్వారా కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈసారి గుప్త నవరాత్రులు జూన్ 19 సోమవారం, జూన్ 28 వరకు కొనసాగుతుంది