శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2019 (18:49 IST)

ప్రసాదంగా పసుపును ఇంటికి తెచ్చుకుంటున్నారా? శరన్నవరాత్రుల్లో?

పసుపు శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని కీలక వస్తువుల్లో అగ్రస్థానాన్ని నిలిచింది. పసుపు, కుంకుమ, పువ్వులు, తమలపాకు, వక్క, పండ్లు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కూరగాయలు, గంధం, తులసి వంటి పూజకు ఉపయోగించే వస్తువుల్లో పసుపుకే అగ్రస్థానం. సుమంగళీ మహిళలకు వాయనం ఇచ్చేటప్పుడు అందుకే పసుపును ముందు ఇస్తారు. 
 
పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు. దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. అలాంటి పసుపును ఆలయం నుంచి ప్రసాదంగా ఇంటికి తీసుకొచ్చి ఏం చేయాలో తెలుసా? 
 
ఆలయాల్లో ఇచ్చే పసుపును ఇంటికి తీసుకొచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగించడం చేస్తారు. కానీ ఇలా చేయకూడదని పండితులు చెప్తున్నారు. ప్రసాదంగా పసుపును ఇంటికి తీసుకొస్తే.. పూజాస్థానంలో వుంటి పూజించాలి. అలా చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు. అయితే ఆలయాల నుంచి తెచ్చుకున్న పసుపును ముఖానికి రాసుకోవడం చేయాలి. 
 
ఇక పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే కన్యలకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది. అలాగే శరన్నవరాత్రుల్లో దేవికి పసుపు రంగు చీరను సమర్పిస్తే.. దోషాలు తొలగిపోతాయి. దుకాణాల్లో పసుపుతో కలిపిన నీటిని చల్లితే వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటి యజమానులకు ఐశ్వర్యం చేకూరుతుంది. 
 
అప్పుల బాధ వుండదు. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది. ఇంటి దేవతా ప్రతిమలను పసుపు నీటితో కడిగితే.. సకల శుభాలు చేకూరుతాయి. 
 
దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని డబ్బులుంచే డ్రాలో పెడితే వ్యాపారానికి ఢోకా వుండదు. సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.