ఆదివారం, 17 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (11:33 IST)

సోమవారం ప్రదోషం.. చంద్రదోషం వున్నవారు.. ఈ రోజున..?

Lord Shiva
సోమవారం నాడు వచ్చే ప్రదోషాన్నే సోమవార ప్రదోషం అంటారు. ఈ ప్రదోష రోజున ఉపవాసం, శివుడిని పూజించడం వలన వివిధ దోషాలు తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరిస్తాయి. పురాణాలలో నిత్య ప్రదోషం, పక్ష ప్రదోషం, సోమవార ప్రదోషం, ప్రళయ ప్రదోషం ఇలా 20 రకాల ప్రదోషాలు ఉన్నాయి.
 
సోమవారం చంద్రుని రోజు. నెలవంకను తలపై ధరించిన శివునికి ప్రీతికరమైన రోజు. ఈ సోమవార ప్రదోషంలో శివారాధనలో విశేషమైన రోజు. చంద్ర దోషం ఉన్నవారు ప్రదోష రోజున శివుని దర్శనం చేసుకోవడం మంచిది. 
 
అపరిష్కృత సమస్యలన్నింటిని పరిష్కరించేవాడు వేదపండితుడైన పరమేశ్వరుడు. అంతేకాదు ప్రదోష కాలంలో నీలకంఠుడిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. 
 
ఈ రోజున శివుడిని, ఆయన వాహనం నందిని పూజించడం విశేషం. ప్రదోష కాలంలో ఉపవాసం ఉండి శివాలయాల్లో జరిగే నంది అభిషేక ఆరాధన, ఈశ్వర పూజల్లో పాల్గొంటూ "నమశ్శివాయ" అనే మంత్రాన్ని జపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.