మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జులై 2021 (17:30 IST)

తులసి చెట్టును పచ్చిపాలు, స్వీట్స్‌తో ఆరాధిస్తే..?

తులసిని ఔషద మొక్కగా కూడా ఉపయోగిస్తుంటారు. తులసి చెట్టును రోజూ పూజించడం వలన ఇంటి సమస్యలు వ్యాపారంలో నష్టం సమస్యలు తొలగిపోతాయని అంటుంటారు. ఇంట్లో ఉన్న అమ్మాయిలకు, అబ్బాయిలకు పెళ్లి సమస్యలు వెంటాడుతుంటే… రోజూ తులసి చెట్టును పూజించడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. ఇంట్లో వాస్తు సమస్యలు ఎదుర్కోంటునట్లయితే తులసి చెట్టు ఆరాధించడం మంచిది. 
 
ఇంటి ఆగ్నేయ దిశలో తులసి మొక్కను నాటాలి. అలాగే… ప్రతిరోజూ.. నెయ్యితో దీపం వెలిగించాలి. వ్యాపారంలో నష్టం రాకుండా ఉండాలంటే.. రోజూ తులసి చెట్టును ఆరాధించడం మంచిది. వ్యాపారం తీవ్ర నష్టం వచ్చినవారు ప్రతి శుక్రవారం.. తులసి చెట్టును పచ్చిపాలు, స్వీట్స్‌తో ఆరాధించండి. మిగిలిన ప్రసాదాన్ని వివాహిత స్త్రీకి దానం చేయడం వ్యాపారంలోని నష్టాలు తగ్గుతాయి. 
 
4 నుంచి 5 తులసి ఆకులను ఇత్తడి కుండలో వేసి సుమారు 24 గంటలు ఉండనివ్వాలి. మరుసటి రోజు ఇంటి ముంగిట ఆ తులసి నీటిని చల్లుకోవాలి. అంతేకాకుండా.. ఇంట్లోని కొన్ని చోట్ల ఈ నీటిని చల్లడం ద్వారా ఇంటి సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం.