శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : శనివారం, 22 మే 2021 (23:32 IST)

వదలని పొడిదగ్గు తగ్గాలంటే..?

పొడి దగ్గు తగ్గాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. పొడి దగ్గు బాధిస్తున్నప్పుడు కాస్త అల్లం టీ తీసుకోవడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అర టీ స్పూన్ శొంఠి పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.
 
చిటికెడు పసుపు, నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకోవాలి. కరక్కాయ కూడా పొడిదగ్గును తగ్గించడంలో దోహదపడుతుంది. కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతుంటే పొడి దగ్గు వెంటనే తగ్గిపోతుంది.
 
తమలపాకులను నమలడం వల్ల కూడా పొడి దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు. తులసి ఆకులను వేడి నీటిలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా కూడా దగ్గును తగ్గించుకోవచ్చు.
 
పొడి దగ్గుతో బాధపడుతుంటే అర టీ స్పూన్ ఇంగువపొడి, ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం, ఒక టేబుల్ టీ స్పూన్ తేనెలను బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా  తీసుకోవడం వల్ల దగ్గును తగ్గించుకోవచ్చు. పాలలో మిరియాల పొడిని వేసుకొని తాగితే దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.