శని దోషాలు తొలగిపోవాలంటే.. రోజూ నువ్వులతో కలిపిన అన్నాన్ని..?
శనిదేవుడి పేరు వినగానే అమ్మో అంటూ జడుసుకుంటాం. శనిగ్రహ దోషంతో జనాలు నానా తంటాలు పడుతుంటారు. శనిదేవుడు అనేక కష్టనష్టాలకు గురిచేస్తాడనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నిజానికి శని దేవుడు న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు. అన్యాయంగా.. అధర్మంగా ఆయన ఎవరినీ బాధించడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆయా వ్యక్తుల కర్మ ఫలితాలను అనుభవించేలా చేస్తాడు అంతే.
శనిదేవుడికి ప్రీతికరమైన పనులను చేయడం వలన, ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆయన అనుగ్రహం కలిగితే పూర్తిస్థాయిలో శాంతిస్తాడు. శనిదేవుడికి ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటిగా కనిపిస్తుంది. అనునిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించి, పూజించే వారి పట్ల ఆయన తన అనుగ్రహాన్ని చూపుతాడు.
అందువలన శివలింగానికి నిత్యం అభిషేకం చేసి, ఆయన ప్రభావం నుంచి బయటపడొచ్చనేది మహర్షుల మాట. అలాగే శనివారం శివాలయాల్లో ప్రసాదాలను పంచడం, రోజూ నువ్వులతో కలిపిన అన్నాన్ని కాకులకు పెట్టడం, హనుమంతుని పూజించడం, సుందరకాండ చదవడం వల్ల, శ్రీవారిని దర్శించడం వలన ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.