శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By selvi
Last Updated : మంగళవారం, 16 మే 2017 (18:15 IST)

నెలసరి, లైంగిక సమస్యలను దూరం చేసుకోవాలంటే.. మహిళలు ఆ పని చేయాల్సిందే?

భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. పురాతన కాలం నుంచి మన దేశంలో ఆచారాలున్నాయి. నేటికీ ఆ ఆచారాలను చాలామంది పాటిస్తున్నారు. ఈ ఆచారాల వెనుక సైన్స్ దాగి వుంది. అలాంటి అద్భుతమైన ఆచారాల్లో మహిళలు కాళ్లకు

భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. పురాతన కాలం నుంచి మన దేశంలో ఆచారాలున్నాయి. నేటికీ ఆ ఆచారాలను చాలామంది పాటిస్తున్నారు. ఈ ఆచారాల వెనుక సైన్స్ దాగి వుంది. అలాంటి అద్భుతమైన ఆచారాల్లో మహిళలు కాళ్లకు పట్టీలు ధరించడం కూడా ఒకటి. మహిళలు పట్టీలను కాళ్లకు అలంకరణ కోసమే ధరిస్తారని అందరూ అనుకుంటారు. కానీ పట్టీలు ధరించడం వెనుక ఆరోగ్యపరమైన శరీరానికి మేలు చేసే విషయముందని పండితులు చెప్తున్నారు. 
 
వెండి పట్టీలను బాలికలు, మహిళలు ధరించడం ద్వారా అవి మడమలను నిరంతరం తాకుతూ వుంటాయి. తద్వారా కాళ్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. అలాగే పట్టీలు ధరించడం ద్వారా నరాల పనితీరు మెరుగవుతుంది. తద్వారా పాదాల నొప్పులు దరిచేరవు. వ్యాధినిరోధక శక్తి పెంపొందుతుంది. నీరసం, అలసటను దూరం చేస్తుంది. ఇంకా పట్టీలు ధరించడం ద్వారా గైనకాలజికల్ సమస్యలు దూరమవుతాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి, హార్మోన్ సమస్యలను నయం అవుతాయి. మహిళల్లో ఏర్పడే గర్భసంచి సమస్యలు మాయమవుతాయి. అలాగే లైంగికపరమైన అనారోగ్యాలు నయమవుతాయి.
 
 ఇకపోతే... పట్టీల నుంచి విడుదలయ్యే శబ్ధం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. దీంతో శరీరానికి, మనస్సుకు ఆహ్లాదం లభిస్తుంది. ఇంకా నెగటివ్ ఎనర్జీని కూడా పట్టీలు పారద్రోలుతాయి. వెండితో తయారు చేసిన ఈ పట్టీలు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పట్టీలు ధరించి ఇంట్లో మహిళలు తిరుగుతూ వుంటే దేవతలకు ఆహ్వాన పలికినట్లు అవుతుందని.. వారితో దేవతలు అన్నీ శుభాలనే కలుగజేస్తారని విశ్వాసం.