బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (14:14 IST)

మంగళవారం నాడు సంకష్ట హర చతుర్థి.. 13న వినాయక పూజ చేస్తే..?

Vinayaka
శుక్ల పక్ష సంకష్ట హర చతుర్థి.. 13న వినాయక పూజ చేస్తే అనుకున్న ఫలితాలు నెరవేరుతాయి. సంకష్టి చతుర్థి ఉపవాసం ఉండడం వల్ల వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి. విఘ్నాలు తొలగిపోతాయి. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు తొలగిపోతాయి. 
 
ఇక స్నానానికి తరువాత వినాయకుడికి దీపం వెలిగించాలి. పూలు సమర్పించాలి. వినాయకుడికి మోతీచూర్ లడ్డూ లేదా మోదక్‌తో నైవేద్యం సమర్పించాలి. 
 
అరటి పండ్లు, కొబ్బరికాయ నివేదించాలి. బెల్లంతో నైవేద్యం సమర్పించాలి. చివరగా వినాయకుడికి హారతి ఇవ్వాలి. విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించాలి. సంకట నాశన గణేశ స్తోత్రం నాలుగుసార్లు చదవాలి.
 
ఈసారి సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోతాయి. సంకష్టహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.