శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 15 జులై 2017 (16:20 IST)

మీ రాశి వార ఫలితాలు... 16-07-2017 నుంచి 22-07-2017 వరకు...

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం పరిచయాలు బలపడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్

మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
పరిచయాలు బలపడతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకునేందుకు యత్నించండి. ఆది, సోమవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. విద్యార్థులకు విదేశీ విద్యల పట్ల అవగాహన ప్రధానం. దళారులు, ప్రకటనలకు విశ్వసించవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. వ్యవసాయ రంగాల వారికి చికాకులు అధికం. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతతో రాణిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అధికం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. మంగళ, బుధవారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. అపరిచితులతో మితంగా సంభాషించండి. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధన ప్రలోభం తగదు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. ద్విచక్ర వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. గురు, శుక్రవారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. విద్యార్థులకు రెండో విడత కౌన్సిలింగ్ అనుకూలం. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు, ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉపాధి పథకాల్లో రాణిస్తారు. జూదాలు, పందాల వల్ల అవస్థలు తప్పవు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష  
దుబారా ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. లక్ష్య సాధనకు కృషి, పట్టుదల ప్రధానం. అవకాశాలు అందినట్టే చేజారుతుంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. శనివారం నాడు ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. ఆత్మీయుల సలహా పాటించండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వృత్తి నైపుణ్యం పెంచుకునేందుకు కృషి చేయండి. ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. సహోద్యోగులతో జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం  
మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సహాయం ఆశించవద్దు. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సన్నిహితుల సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆది, సోమవారాల్లో శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం విద్య, ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు తప్పవు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులెదుర్కుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిరుద్యోగులకు చక్కని అవకాశం లభిస్తుంది. ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందుతాయి. అధికారులకు కొత్త బాధ్యతలు, పనిభారం, వ్యవసాయ పనులు చురుకుగా సాగుతాయి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ సాయంతో ఒక వ్యవహారం సానుకూలమవుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మంగళ, బుధవారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. బుధవారం నాడు కొత్త సమస్యలెదురయ్యే ఆస్కారం ఉంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఏజెన్సీలు, టెండర్లు చేజిక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. అభినందనలు సత్కారాలు అందుకుంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఒప్పందాలకు అనుకూలం. వ్యవహారాల్లో మీ జోక్యం అనివార్యం. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలు నెరవేరుతాయి. ఆది, గురువారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంప్రదింపులు, ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు, వాహనం అమర్చుకుంటారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన మంచిది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ప్రయాణంలో ప్రయాసలు తప్పవు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ 
దుబారా ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధువుల వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి. పంతాలు, భేషజాలకు పోవద్దు. లౌక్యంగా వ్యవహరించాలి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ విషయాలు పట్టించుకోవాలి. మంగళ, శనివారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గృహ నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో చికాకులు తప్పవు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
ధనుస్సు : మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం  
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిడి, మొహమాటాలకు లొంగవద్దు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపు చేయాలనే సంకల్పం ఫలించదు. పరిచయస్తులు సహాయం అర్ధిస్తారు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కువగా చూడొద్దు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో మీ శకునాల ప్రభావం అధికం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ఆశించిన టెండర్లు, ఏజెన్సీలు దక్కకపోవచ్చు. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. ఆప్తులను కలుసుకోవాలనిపిస్తుంది. శనివారం నాడు పనులు, కార్యక్రమాలు వాయిదా పడతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆశాదృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. మీ కృషి ఫలించే రోజు త్వరలోనే ఉంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
కుంభం : ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
ఈ వారం వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. రుణయత్నం ఫలిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. కొన్ని పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆందోళన తొలగుతుంది. విలువైన పత్రాలు జాగ్రత్త. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తించుకోవాలి. మీ ప్రమేయంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుది. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. అభినందనలు. సత్కారాలు అందుకుంటారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి  
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భేషజాలు, మొహమాటాలకు పోవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. రుణ విముక్తులవుతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. పనుల సకాలంలో పూర్తి కాగలవు. చిన్ననాటి పరిచయస్తుల తారసపడతారు. పెద్దల ఆరోగ్య మెరుగపడుతుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాభివృద్ధి పథకాలు అమలు చేస్తారు. షాపులు, గృహమార్పు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవీయోగం, ధనలాభం. ప్రయాణంలో జాగ్రత్త. ఆస్తి, స్థల వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి.