శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: బుధవారం, 30 జనవరి 2019 (17:22 IST)

ఫిబ్రవరి 2019 రాశి ఫలితాలు... ఆ 4 రాశులు వారు అలా చేయాలి(Video)

1వ తేదీ బుధుడు ధనస్సు నందు, 1వ తేదీ శుక్రుడు వృశ్చికం నందు, 14వ తేదీ రవి మకరం నందు, 20వ తేదీ బుధుడు మకరం నందు, 29 తేదీ శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం. 2వ తేదీన శనిత్రయోదశి, 3న మాస శివరాత్రి, 12న రథసప్తమి. 16వ తేదీన అంతర్వేది తీర్థం. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారు శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది. ఉష్ణోగ్రతలు క్రమంగా అధికమవుతాయి. ధరలు పెరుగుతాయి.
 
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం అనుకూలదాయకమే. ఆర్థికస్థితి సంతృప్తికరం. రుణ బాధలు తొలగి కుదుటపడుతారు. పెట్టుబడులకు అనుకూలం. గృహం సందడిగా ఉంటుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు పనిభారం, ఒత్తిళ్లతో మనస్థిమితం ఉండదు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపం. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.  
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. మీ చిత్తశుద్ధికి నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలు లాభిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువుల గురించి ఆలోచిస్తారు. వ్యాపార విస్తరణకు అనుకూలం. సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటవుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆశావాహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి.  
 
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కష్టం ఫలిస్తుంది. శుభవార్తలు వింటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. దస్త్రం, వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. బాధ్యతలు అధికమవుతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. హామీలివ్వవద్దు. ఆచితూచి వ్యవహరించాలి. గృహం సందడిగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, అధికారులకు ఒత్తిడి, పనిభారం. విద్యార్థులకు అవగాహన లోపం. వృత్తుల వారికి సామాన్యం. వాహనచోదకులకు దూకుడు తగదు. సమావేశాల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికస్థితి సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం చదువుల పట్ల శ్రద్ధ అవసరం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. 
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం యోగదాయకం. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఖర్చులు సామాన్యం. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సన్నిహితుల ప్రోత్సాహనం ఉంటుంది. సంప్రదింపులతో హడావుడిగా ఉంటారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభనజ్ఞుల సలహా పాటించండి. స్థిరాస్తి క్రయవిక్రయంలో పునరాలోచన అవసరం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. సంతానం చదువుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆలోచనులు నిలకడగా ఉండవు. వ్యవహారాల్లో ప్రతికూలతలు, చికాకులు అధికం. అవకాశాలు దక్కకపోవచ్చు. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. స్థిమితంగా ఉండడానికి యత్నించండి. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి.  
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. ఆరోగ్యం జాగ్రత్త. సన్నిహితుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. పట్టుదలకు పోవద్దు. చాకచక్యంగా వ్యవహరించాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు వాయిదా పడుతాయి. 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
అన్ని రంగాల వారికి శుభదాయకమే. అనూకూల పరిస్థితులున్నాయి. వాగ్ధిటితో నెట్టుకొస్తారు. వ్యవహారజయం, వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహారానుకూలత ఉంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, పనిభారం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
 
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయాలి. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి అధికం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. దంపతుల మధ్య దాపరికం తగదు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఈ ఇబ్బందులు, చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడుతాయి. యత్నాలు విరమించుకోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపరాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అత్యుత్సాహనం ప్రదర్శించవద్దు. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి.  
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. అనుకూల ఫలితాలున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. మీ నమ్మకం వమ్ముకాదు. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతాన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. బాధ్యతలు, వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. చర్చలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ప్రథమార్ధం ఆశాజనకం. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతప్తికరం. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. గృహమార్పు కలిసివస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వీడియో చూడండి...