మహిళల్లో ఎదుగుదలకు అవరోధాలుగా నిలిచేవి ఏవి?
ఓ వ్యక్తి ఎదుగుదలకు అవరోధాలుగా నిలిచేవి ఏవని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. ఎదుగులలో తొలి అవరోధం భయం. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో అన్న అనుమానం ఏ పనీ చేయనీయకుండా వెనక్కు లాగేస్తుంటుంది. ప్రతిదానికి భయపడే తత్వం గలవారు అంత త్వరగా ఏదీ సాధించలేరు. ఇటువంటి వారిలో ఆత్మస్థైర్యం అనేదే లేకుండా పోయే అవకాశం లేకపోలేదు.
మరో అవరోధం నిర్లక్ష్య వైఖరి. ఇటువంటి దృక్పథం వల్ల పనిలో పరిపూర్ణత ఉండదు. వాయిదా మనస్తత్వం పెరిగిపోతుంది. ఎవరినీ లెక్కచేయనితనం వల్ల ఆథ్మ గౌరవాన్ని కోల్పోయి పరిస్థితులు ఏర్పడతాయి. సహనలేమి మరో ఆటంకం. ఎప్పుడూ అసహనంగా, చిరాగ్గా ఉంటుంటే వీరికి దగ్గరగా వెళ్ళేందుకు ఎవ్వరూ అంతగా ఇష్టపడరు. ఎటువంటి విజయానికైనా ఓరిమి చక్కని సోపానంగా నిలుస్తుంది.