ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Selvi
Last Updated : బుధవారం, 14 జనవరి 2015 (15:39 IST)

అధికారం ఉంటే మహిళలకు కుంగుబాటు తప్పదా?

ఉన్నత పదవులు, లేడీ బాస్‌ వంటి అధికారంలో ఉండే మహిళలకు కుంగుబాటు తప్పదా అంటే అవునంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. సాధారణంగా ఉద్యోగ వాతావరణంలో పెద్దస్థాయికొచ్చిన మహిళలు రకరకాల మాటలు పడాల్సి వస్తుంది. అయితే ఆ స్థాయికి వెళ్లడానికి మహిళలు మానసికంగా ఆరోగ్యపరంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. అదే మానసిక కుంగుబాటు. 
 
అధికార హోదా మగవాళ్లకు ఆత్మవిశ్వాసాన్నీ, సమాజంలో ఉన్నత హోదానీ అందిస్తే మహిళల్లో మాత్రం అది మానసికంగా ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తోందని పరిశోధనలో తేలింది. స్త్రీల మానసిక అనారోగ్యానికి కారణమయ్యే అంశాలపై జరిపిన పరిశోధనలో అధికార హోదాలో ఉండే మహిళల్లో మానసిక కుంగుబాటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 
 
మహిళలు పెద్ద స్థాయికి చేరుకోవాలంటే మగవారికన్నా మహిళలు ఎంతో పోరాడాల్సి వస్తోంది. కుటుంబంలో, కార్యాలయంలో అనే వివక్షల్నీ, అసూయల్నీ ఎదుర్కొంటూ ముందుకెళ్లాలి. ఆ క్రమంలో మనసులో ఏర్పడే ఆవేదనలే కుంగుబాటుకి కారణం అవుతున్నాయి.  
 
దీన్నించి బయటపడాలంటే.. వీలు కుదిరినప్పుడల్లా బాధ్యతల్ని పక్కనబెట్టి తమపై తాము శ్రద్ధ పెట్టాలి. వ్యక్తిగత ఆసక్తులకూ, వ్యాయామానికీ సమయం కేటాయించాలని మానసిక నిపుణులు అంటున్నారు.