ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Selvi
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2014 (18:39 IST)

డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే ఆత్మవిశ్వాసం పెరిగినట్టే!

డ్రెస్సింగ్ సెన్స్ ఉంటే ఆత్మవిశ్వాసం పెరిగినట్టే! అంటున్నారు సైకాలజిస్టులు. మంచి దుస్తులూ, యాక్సెసలరీలు వేసుకోవడం ఎదుటివారిని ఆకట్టుకోవడం కోసమే కాదు.. మనపై మనం నమ్మకాన్ని పెంచుకోవడానికీ అదే చాలా కీలకం అంటున్నారు.. మానసిక నిపుణులు. 
 
మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందాలంటే.. ఏదో నామమాత్రం డ్రెస్ చేయకుండా.. నచ్చిన విధంగా దుస్తులను ఎంపిక చేయడంపైనే దృష్టి పెట్టాలని అమెరికాలోని కెలాగ్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
 
ఇకపోతే.. ఆత్మ విశ్వాసం పెంచుకోవాలంటే.. భయాన్ని వీడండి. ధైర్యంగా ముందుకెళ్లండి. బాస్‌తో ముఖాముఖి చర్చలు జరపండి. మీటింగ్‌లకు వెళ్లేటప్పుడు ఏదైనా హుషారునిచ్చే పాటలు వినండి. మీటింగ్‌లకు జడుసుకోకుండా ముందుకు వెళ్లండి. ఇలా చేస్తే ఆత్మ విశ్వాసం పెంపొందినట్లేనని మానసిక నిపుణులు సెలవిస్తున్నారు.