ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By Selvi
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2014 (17:41 IST)

మహిళలూ.. కుటుంబంతో కొంత సమయం గడపండి..!

ఒక్కోసారి పనిలో అన్నీ మరిచిపోతుంటాం. మనకు ఇష్టమైన లక్ష్యం సాధించే ప్రయత్నంలో పీకల్లోతు మునిగిపోతాం. ఆ క్రమంలో వ్యక్తిగత జీవితాన్నీ కోల్పోతుంటాం. పిల్లలతో నాణ్యమైన సమయాన్నీ గడపలేం. మీరూ అదే స్థితిలో ఉంటే ఇలా చేయండి. 
 
కెరీర్ ప్రారంభించడానికి ముందు లక్ష్యాలను నిర్దేశించుకోండి. అయితే వృత్తిలో పడి, వ్యక్తిగత జీవితాన్ని ఎంతవరకు కోల్పోతున్నామో ఆలోచించుకోండి. జీవితంలో అతి ముఖ్యమైన ప్రాథమ్యాలేమిటో రాయండి. వాటికి తగ్గట్టే రోజులో మీ సమయాన్ని విభజించుకోండి. ఆ మూడింట్లో వృత్తి ఒక అంశం మాత్రమేనని తెలుసుకోండి. అవసరాన్ని బట్టి దానికి కాస్త ఎక్కువ సమయం కేటాయించినా మిగతా వాటిని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే చాలు. 
 
సాయంత్రం ఇంటికొచ్చాక సమయమంతా పిల్లలకేగా.. అంటుంటారు. చాలామంది సమస్యేమిటంటే అది నాణ్యమైన సమయం ఉండదు. పిల్లల్ని కేవలం హోమ్ వర్క్ చేసేలా చూడటమే. వాళ్లతో గడపడం అనుకుంటారు చాలామంది. ఇది సరికాదు. పిల్లతో ఆడుతూపాడుతూ గడపగలగాలి. 
 
మీ పాత బాల్యాన్ని మళ్లీ వాళ్ల ముందుకే తీసుకురాగలగాలి.. అంటారు నిపుణులు. వారంలో ఒకరోజు పూర్తిగా ఆఫీసు పనులకి దూరంగా ఉండటం, ల్యాప్‌టాప్‌లూ ఫోన్లకు సెలవు ప్రకటించడం, కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయాలనుకోవడాన్ని తప్పనిసరిగా పాటించి చూడండి. ఇంతకాలం ఏం కోల్పోయారో అర్థమవుతుంది.