1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (16:40 IST)

మొదలెట్టిన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలంటే?

మొదలెట్టిన కార్యానికి విఘ్నం కలగకుండా ఉండాలంటే..
 
భునాయకం వా ధననాయకం వా|
భజన్ భువం వా ధనమేతి లోకే |
తద్విఘ్న నాథం న భజాని కింతు | 
సహస్త్రశ స్తం ప్రణమామి నిత్యం ||
 
అనే మంత్రాన్ని పఠించాలి. భూపతిని ఆశ్రయిస్తే భూమి ఇస్తాడు. ధనవంతుడిని ఆశ్రయిస్తే ధనం లభిస్తుంది. ఇది లోకం తీరు. అలానే విఘ్నపతిని ఆశ్రయిస్తే విఘ్నాలే ఇస్తాడు. అందువలన స్వామీ.. విఘ్నేశ్వరా నాకు విఘ్నాలు కలుగకుండా చూడవయా అంటూ నిత్యం ఆ విఘ్నేశ్వరుడిని నమస్కరించుకోవాలి.