శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 20 ఏప్రియల్ 2022 (22:11 IST)

ప్రేమించినవాడు ఎలాంటివాడో తెలుసా?

Love
ఏ బాధనైనా నివారించే మందు లాంటివాడు ప్రేమించినవాడు. కానీ ఆ ప్రేమించినవాడు కలిగించిన బాధను ఈ ప్రపంచంలో ఏ మందు నివారించలేనిది.

 
కొన్నిసార్లు జీవితంలో నాకు ఎవ్వరూ అక్కర్లేదు అనుకుంటాం. కానీ చాలాసార్లు మనకు కావలసినప్పుడు ఒక్కళ్లూ మనతో వుండరు.

 
ఎక్కువ భావోద్రేకాలతో జీవితం గడపటం కష్టం అలాగే ఖచ్చితంగా మాట్లాడి బంధుత్వాలు నిలబెట్టుకోవడం కష్టం. 

 
కష్టపడి పనిచేయడం అనేది మేడ పైకి మెట్లు ఎక్కడం లాంటిది. అదృష్టం అనేది లిఫ్ట్ లాంటిది. లిఫ్ట్ ఎప్పుడైనా నిలిచిపోవచ్చు. కానీ మెట్లు నువ్వు ఎక్కిన కొలది పైకి తీసుకునిపోతాయి.

 
నీటి చెరువులో పడిన వాన చినుకుకు ఉనికి లేదు. కానీ ఆ చినుక తామర ఆకుపైన పడితే ముత్యంలా మెరుస్తుంది. అలాగే నువ్వు ఎక్కడ రాణించగలవో ఆ ప్రదేశాన్ని ఎన్నుకో.