శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By Selvi
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (12:06 IST)

మీ భాగస్వామి చేసే పనులు నచ్చకపోతే.. సున్నితంగా.. ప్రేమగా చెప్పండి గురూ..

భాగస్వామితో జగడాలు మామూలే. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. సాధారణంగా తన భర్త తాను చెప్పింది వింటే బాగుంటుందని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఈ కోరిక పెత్తనం

భాగస్వామితో జగడాలు మామూలే. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. సాధారణంగా తన భర్త తాను చెప్పింది వింటే బాగుంటుందని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే ఈ కోరిక పెత్తనంగా మారకుండా జాగ్రత్త పడాలి. తాను చెప్పిందే వినాలని భాగస్వామికి షరతులు పెట్టకూడదు. అది మహిళైనా సరే.. మగాడైనా సరే. 
 
ఇతరుల మాట్లాడటంలో తప్పు కనిపెట్టడం.. తాను చెప్పిందే వినాలని కండిషన్లు పెట్టడం సరికాదు. స్నేహితులతో సినిమాలకు వెళ్లకు వంటి మాటలతో భాగస్వామికి ఇబ్బంది పెట్టకూడదు. మీ భాగస్వామి చేసే పనుల్లో మీకేమైనా నచ్చకపోతే ఆ విషయాన్ని సున్నితంగా, ప్రేమగా చెప్పి ఒప్పించాలి కానీ మీ అభిప్రాయాన్ని వారిపై బలవంతంగా రుద్దడం మాత్రం చేయకూడదు.
 
అలాగే ఇతరులతో మీ భర్తను పోల్చడం మానేయాలి. మగవారి అహం ఎక్కువగా దెబ్బతినేది ఇక్కడేనని గమనించాలి. స్నేహితురాలి భర్తతోనే.. ఇతరులతోనో పోల్చడం ద్వారా చిరాకు కలిగే అవకాశం వుంది. వాగ్వివాదం మొదలై జగడాలకు దారితీస్తుందని గమనించాలని సైకాలజిస్టులు అంటున్నారు.