శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By ivr
Last Modified: సోమవారం, 8 మే 2017 (22:24 IST)

వివాహితను ప్రేమించాడట... ఇప్పుడు నేను కావాలట....

నేను ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు నా పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు. ఐతే ఈమధ్య నా స్నేహితురాలికి అన్న వరస అయ్యే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను మాటలను బట్టి చాలామంచివాడనిపించింది. ఎందుకనో అతడిని చూడగానే ప్రేమించేశాను. అతడు కూడా నా పట్ల

నేను ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు నా పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారు. ఐతే ఈమధ్య నా స్నేహితురాలికి అన్న వరస అయ్యే యువకుడితో పరిచయం ఏర్పడింది. అతను మాటలను బట్టి చాలామంచివాడనిపించింది. ఎందుకనో అతడిని చూడగానే ప్రేమించేశాను. అతడు కూడా నా పట్ల ఇష్టతను కనబరిచాడు. దానితో ఓ రోజు అతడి గతం గురించి, నా గతం గురించి చెప్పుకున్నాం. అతడు ఓ షాకింగ్ విషయం చెప్పాడు. గతంలో ఉత్తరాది రాష్ట్రంలో పనిచేసేటపుడు ఓ పెళ్లయిన యువతిని ప్రేమించాడట. 
 
ఆ తర్వాత ఆమెతో శారీరకంగా కూడా కలిశాడట. కొన్నాళ్ల తర్వాత ఆమె ఇకచాలు... ఇటువంటివి వద్దు అని అతనికి దూరమైందట. దాంతో అప్పటి నుంచి భగ్న ప్రేమికుడిగా మారిపోయి ఓ రోజు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడట. ఆ సమయంలోనే నేను కనబడేసరికి ఇప్పుడు నాతోటిదే లోకంగా వుందంటున్నాడు. ఇప్పుడు నాకు భయమేస్తున్న విషయం ఏమిటంటే... ఇతడిని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా వుంటుందనీ...
 
గతం గురించి అడిగినప్పుడు అతడు వున్నదివున్నట్లు చెప్పేశాడు. దాచిపెట్టలేదు. పెళ్లయ్యాక అతడు మళ్లీ ఇలాంటి పనులు చేస్తాడేమోనన్న అనుమానం భయం వున్నప్పుడు అతడితో పెళ్లి అనేది మర్చిపోవడం మంచిది. అలాకాకుండా అతడిపై నమ్మకం వుంటే అతడిని పెళ్లాడవచ్చు. ఐతే భయంతో పెళ్లి అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే భవిష్యత్తులో అతడు ఆమె గురించి మళ్లీ ఎప్పుడైనా ప్రస్తావన తెస్తే మీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.