దంపతులు హ్యాపీగా ఉండాలా? సర్దుకుపోండి.. ఈ చిట్కాలు పాటించండి..
భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలా? దంపతులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. కుటుంబంతో కలిసిపోయాక ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. సంతానం కలిగినా భార్యాభర్తలు మనోభావాలకు అనుగుణంగా సర్దుక
భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలా? దంపతులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. కుటుంబంతో కలిసిపోయాక ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా.. సంతానం కలిగినా భార్యాభర్తలు మనోభావాలకు అనుగుణంగా సర్దుకుపోతే సమస్యలుండవని వారు చెప్తున్నారు.
భార్య లేదా భర్త ఇద్దరిలో ఇద్దరిలో ఎవరో ఒకరు ఆనందంగా ఉండినట్లైతే రెండోవారి ఆరోగ్యం కూడా బాగుంటుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. అందుచేత భార్యాభర్తలు మూడీగా ఉండకుండా.. భాగస్వామిని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడితే.. ఆరోగ్యంతో పాటు మానసికంగా కుదుటపడతారని పరిశోధకులు తెలిపారు. భార్యాభర్తలు హ్యాపీగా ఉంటే.. అనారోగ్య సమస్యలు తలెత్తవని వారంటున్నారు.
ఇది యంగ్, మధ్య వయసు లేదా వృద్ధ జంటల్లో ఎవరికైనా వర్తిస్తుందని చెప్తున్నారు. భాగస్వాముల్లో ఒకరు సరదా స్వభావం కలవారైతే అది తోటివారి ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుందట. స్వతహాగా సంతోషంగా ఉండేవాళ్లయినప్పటికీ భార్య లేదా భర్త కూడా ఆనందంగా ఉండేవాళ్లయితే ఇక ఆయా వ్యక్తుల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని పరిశోధకులు చెప్తున్నారు.
స్వతహాగా హ్యాపీగా ఉండేవారైతే ఇతరుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారని.. ఇంటా బయటా కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూస్తారు. దాంతో శారీరక, మానసిక ఆరోగ్యంతోబాటు సామాజిక సంబంధాలూ బలపడతాయని పరిశోధకులు అంటున్నారు.