శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (12:47 IST)

ఒత్తిడికి లోనైతే.. అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లే..

ఒత్తిడిని వెలివేసేందుకు సాధన చేయాలి. ఇలాచేస్తే మానసిక, శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ఒత్తిడిని అధిగమించడం కూడా ఆరోగ్య ప్రణాళికలో భాగమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అన్ని వయస్సుల వారు మాన

ఒత్తిడిని వెలివేసేందుకు సాధన చేయాలి. ఇలాచేస్తే మానసిక, శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ఒత్తిడిని అధిగమించడం కూడా ఆరోగ్య ప్రణాళికలో భాగమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుతం అన్ని వయస్సుల వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొందరు చిన్న సమస్యలను కూడా అదేపనిగా భూతద్ధంలో చూసుకోవడం, లేని దానిని కూడా సమస్యగా ఊహించుకుని ఒత్తిడికి గురౌతుంటారు.
 
ఈ ప్రవర్తన కారణంగా ఇటు గృహంతో పాటు అటు స్నేహితులు, ఆఫీసులోని సహచరులపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి వారు మానసిక ఒత్తిడికి ఉపశమనం పేరుతో సిగరెట్‌, తాగుడు వంటి వ్యసనాలకు బానిసలైపోతారు. ఇవి శారీరక అనారోగ్యానికి దారితీస్తాయి. ఒత్తిడిని అధిగమించాలంటే.. మెదడును ప్రశాంతంగా వుంచుకోవాలి. 
 
పనిభారంగా ఉందనిపిస్తే దాన్ని తోటి ఉద్యోగులతో షేర్‌ చేసుకోవాలి. కాస్త సమయం తీసుకోవాలి. పూర్తి చేయాల్సిన పనికి పక్కా ప్రణాళిక ప్రకారం ముగించాలని సైకలాజిస్టులు సూచిస్తున్నారు.