సోమవారం, 27 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జనవరి 2025 (13:43 IST)

Abhijit Muhurat: అభిజిత్ ముహూర్తం అంటే ఏమిటి? మధ్యాహ్నం పూట ఇవి చేస్తే?

Abhijit Muhurat
Abhijit Muhurat
అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం సమయంలో దాదాపు 48 నిమిషాల పాటు ఉండే శుభ సమయం. అభిజిత్ ముహూర్తం లెక్కలేనన్ని దోషాలను నాశనం చేయగలదు. అన్ని రకాల శుభ కార్యాలను ప్రారంభించడానికి ఇది ఉత్తమమైన ముహూర్తాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 
 
అభిజిత్ ముహూర్తం ఒక శక్తివంతమైనది. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య ఉన్న 15 ముహూర్తాలలో అభిజిత్ ముహూర్తం 8వ ముహూర్తం. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్య సమయ వ్యవధిని 15 సమాన భాగాలుగా విభజించారు. 
 
పదిహేను భాగాల మధ్య భాగాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో సూర్యోదయం ఉదయం 6 గంటలకు సంభవించి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు సంభవిస్తే, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం సరిగ్గా 24 నిమిషాల ముందు ప్రారంభమై మధ్యాహ్నం 24 నిమిషాల తర్వాత ముగుస్తుంది. 
 
ఇంకా చెప్పాలంటే, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:20 గంటల మధ్య ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో కాలానుగుణ మార్పు కారణంగా, అభిజిత్ ముహూర్తం, ఖచ్చితమైన సమయం, వ్యవధి నిర్ణయించబడలేదు. 
 
అభిజిత్ ముహూర్తంలో శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని నమ్ముతారు. ఇంకా, అభిజిత్ ముహూర్తం తన సుదర్శన చక్రంతో లెక్కలేనన్ని దోషాలను నాశనం చేసేందు విష్ణువు సిద్ధంగా వుంటాడని విశ్వాసం.
 
అభిజిత్ ముహూర్తాన్ని అభిజిన్ ముహూర్తం, చతుర్థ లగ్నం, కుతుబ్ ముహూర్తం, స్వామి తిథియంశ ముహూర్తం అని కూడా పిలుస్తారు. వివాహం, ఉపనయన వేడుకలు వంటి మంగళకర కార్యక్రమాలకు కూడా అభిజిత్ ముహూర్తం తగినది కాదు. అయితే ఈ సమయంలో మంత్ర పఠనం, పూజలు, శ్రీలక్ష్మీ ఆరాధన, శ్రీ విష్ణువు, శివారాధన చేయడం వేయి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది.