ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (18:35 IST)

కనుమ, ముక్కనుమ రోజున పూజ ఇలా చేస్తే?

sankranthi
కనుమ పండుగ రోజున మాంసాహారం తీసుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సంక్రాంత పండుగలో భాగంగా కనుమ రోజున వేకువ జామున నిద్రలేచి దేవతారాధన చేయడం మంచిది. మూడవ రోజున కనుమ రోజున తమ పొలాలలో నిరంతరం శ్రమించే పశువులను పూజిస్తారు. 
 
రైతులు ఉదయాన్నే పశువులను, వాటి పాకలను శుభ్రంగా కడిగి అలంకరించి పూజలు చేస్తారు. వాటికి ఇష్టమైన వాటిని తినిపిస్తారు. కనుమనాడు రథం ముగ్గు వేస్తారు. కొందరు ముక్కనుమ రోజున కూడా రథం ముగ్గు వేస్తుంటారు 
 
సంక్రాంతి పండుగలో ముఖ్యంగా నాలుగవ రోజును ముక్కనుమను పిలుస్తారు. ముక్కనుమ నాడు సాధారణంగా మాంసాహార ప్రియులు తాము ఇష్టపడే వివిధ మాంసాహార వంటకాలను వండుకుని తింటారు. అయితే సంక్రాంతి పండుగలోని మొదటి మూడు రోజులు కేవలం శాకాహారమే భుజించాలి.
 
ముక్కనుమ రోజున కొత్త వధువుల సావిత్రి గౌరీవ్రతం అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇందుకోసం మట్టి ప్రతిమలను ప్రతిష్టించుకుని వాటికి తొమ్మిది రోజుల పాటు తొమ్మది రకాల పిండి వంటలు నివేదనం చేస్తారు. చివరికి ఆ బొమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.