బాబా చెప్పిన అమృతతుల్యమగు పలుకులు
1. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. 2. ఎవరైతే సర్వశ్య శరణాగతి చేసి నన్ను ధ్యానించెదరో, నా నామమునే ఎల్లప్పుడు జపించునో వారికి నేను ఋణస్ధుడను. వారికి మోక్షమిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను. కనుక నీవు గర్వము, అహంకారము
1. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు.
2. ఎవరైతే సర్వశ్య శరణాగతి చేసి నన్ను ధ్యానించెదరో, నా నామమునే ఎల్లప్పుడు జపించునో వారికి నేను ఋణస్ధుడను. వారికి మోక్షమిచ్చి వారి ఋణము తీర్చుకొనెదను. కనుక నీవు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములో ఉన్న నన్ను సర్వశ్య శరణాగతి వేడిన అందరిలోను నన్ను చూడగలవు.
3. ఎవరయితే బాధలను అనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు మిక్కిలి ప్రీతిపాత్రులవుదురు.
4. అందరూ బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును.
5. అన్ని విషయాలలో అహంకారము, గర్వములను వదిలిపెట్టినచో నీవు ఆధ్యాత్మికంగా ముందుకు పోగలవు. అహంకారముతో నిండి కోరికలకు లొంగిపోయిన వారికి సద్గురు బోధ నిరుపయోగము.