ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By venu
Last Modified: సోమవారం, 5 జూన్ 2017 (19:10 IST)

ఆ దానం చేస్తే లక్ష్మీదేవిని గెంటివేసినట్లేనట... ఈ దానాలతో సర్వనాశనం...

మానవ జన్మకు సార్థకత సాటి మానవుని మంచి కోరడమేనంటారు పెద్దలు. సాటి మానవుడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని, మనకు ఉన్నంతలో సాటివారి సంతోషం కోసం కొంత దానం చేయాలని.. అప్పుడే ఇహపర లోకాల్లోనూ మనకు శాంతి సంతోషాలు లభిస్తాయని చిన్నతనం నుండి నూరిపోస్తుంటారు. కంటిచూపు

మానవ జన్మకు సార్థకత సాటి మానవుని మంచి కోరడమేనంటారు పెద్దలు. సాటి మానవుడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని, మనకు ఉన్నంతలో సాటివారి సంతోషం కోసం కొంత దానం చేయాలని.. అప్పుడే ఇహపర లోకాల్లోనూ మనకు శాంతి సంతోషాలు లభిస్తాయని చిన్నతనం నుండి నూరిపోస్తుంటారు. కంటిచూపు లేనివారికి నేత్రదానం, చదువు పట్ల జిజ్ఞాస ఉండేవారికి విద్యాదానం, ప్రమాదాల్లో గాయపడినవారికి రక్తదానం, భవిష్యత్తులో ఉపయోగపడేలా అవయవదానం అంటూ సంవత్సరాలు గడిచేకొద్దీ దానాలు సైతం కొత్తపుంతలు తొక్కుతున్నాయి. కానీ దానాల విషయంలో మాత్రం శ్రీశ్రీ చెప్పినట్లు "కాదేదీ దానానికి అనర్హం" అనరాదంటున్నారు పండితులు.
 
కొన్ని వస్తువులను దానరూపంలో కానీ, ఉచితంగా కానీ ఇస్తే సర్వనాశనం అయిపోతారంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఆ వస్తువులు ఏంటో చూడండి మరి...
 
సూదులు, కత్తెరలు, కత్తులు - ఈ వస్తువులను దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పాటు, జీవితంలో ఏదీ కలిసిరాదని అంటున్నారు.
 
పాడైన ఆహారం - తెలిసి కానీ, తెలియకకానీ చెడిపోయిన ఆహారాన్ని దానం చేయరాదు. ఇలా భుజించే యోగ్యం కాని ఆహారాన్ని దానం చేస్తే ఇక వారు కోర్టు మెట్లు ఎక్కవలసిందేనట. ఏదో ఒక సమస్యలో ఇరుక్కుని కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిందేనట. అలాగే ధనం సైతం వచ్చింది వచ్చినట్లు ఖర్చయిపోయి, దరిద్రులుగా మిగిలిపోతారట.
 
విరిగిన/పగిలిన/చిరిగిన వస్తువులు - విరిగిన కంచాలు, పాత్రలు కానీ, పగిలిన కుర్చీలు, మరేదైనా ఫర్నిచర్ కానీ, చినిగిన దుస్తులు కానీ దానం చేయరాదు. అంటే ఆ వస్తువు దేని కొరకు ఉద్దేశించబడిందో ఆ పనికి అనర్హమైనప్పుడు ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వరాదు. వాటిని దానం చేయడం అటుంచి, అసలు ఇంట్లో ఉంచుకోవడమే తప్పట, వాటి ద్వారా నెగటివ్ ఎనర్జీ బారిన పడతారట. వాటిని దానం చేస్తే అదృష్టం కలిసిరాకపోగా, తాడుని ముట్టుకున్నా పామై కరుస్తుందట. అంటే తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలే ఎదురవుతాయట. 
 
చీపురుకట్టలు - చీపుర్లను కొన్ని ఊళ్లల్లో లక్ష్మీదేవి అని భావిస్తుంటారు. ఇక వాటిని దానం చేయడం అంటే చేజేతులా లక్ష్మీదేవిని గెంటేసినట్లే. చీపుర్లను దానం చేసినవారి ఇంట లక్ష్మీదేవి ఉండదట. 
 
ప్లాస్టిక్ వస్తువులు - ప్లాస్టిక్ వస్తువులనైతే దానం చేయడం అటుంచి, కాసేపు వాడుకుని తిరిగి ఇచ్చేందుకు అరువుగా కూడా ఇవ్వొద్దంటున్నారు. కెరీర్ నాశనమైపోతుందని, నిలకడలేమి వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు.