శనివారం, 23 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (11:29 IST)

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి దొర్లింది. గంగా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహ

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి దొర్లింది. గంగా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లోని సిమారియా ఘాట్ వద్ద జరిగింది. 
 
తొక్కిసలాటలో 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు.. ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి.. శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. 
 
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఇరు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకల్లో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం, వేములవాడ ఆలయాలకు భక్తులు బారులు తీరారు. నదీ పరివాహక ప్రాంతాలు భక్తులతో సందడిగా మారిపోయాయి.