శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (15:46 IST)

దేవుళ్ళకు ఉక్కపోత.. సిద్ధి వినాయకుడికి కూలర్ ఏర్పాటు...

దేశ వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటిపూట ఇల్లు వదిలి బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 
 
అయితే, ఎండ వేడిమికి దేవుళ్లు సైతం ఇబ్బంది పడుతున్నారంటూ మహారాష్ట్రలోని కాన్పూర్‌లో ఉన్న పలు దేవాలయాల్లో కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలోని సిద్ధి వినాయక దేవాలయం పూజారి సుర్జీత్ కుమార్ దూబే మాట్లాడుతూ, దేవుళ్లు కూడా ఉక్కపోతకు గురవుతారని చెప్పారు. 
 
వాళ్లు కూడా మానవులులాంటి వారే అని అన్నారు. అందుకే స్వామివారిని చల్లగా ఉంచేందుకు కూలర్ ఏర్పాటు చేశామని చెప్పారు. వేడిని దృష్టిలో ఉంచుకుని ఆయనకు పలుచటి వస్త్రాలను ధరింపజేశామని తెలిపారు.