శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:27 IST)

శ్రీవారి భక్తులకు చేదు వార్త, బ్రహ్మోత్సవ వాహన సేవలన్నీ ఏకాంతంగానే..?

తిరుమల చరిత్రలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగిన సంధర్భాలు లేవు. మొట్టమొదటిసారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో టిటిడి పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ యేడాది అధికమాసం కావడంతో రెండు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. అక్టోబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటారు. సెప్టెంబర్ నెలలో జరిగే బ్రహ్మోత్సవాలు మాత్రం ఏకాంతంగానే నిర్వహించాలని తీర్మానించారు. 
 
తిరుమలలో పాలకమండలి సమావేశమై మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. బ్రహ్మోత్సవాలంటే లక్షలాదిమంది భక్తులు ఎప్పుడు తిరుమలకు వస్తుంటారు. అలాంటి తిరుమల కరోనా కారణంగా ఆరు నెలల పాటు భక్తులు లేక బోసిపోయి కనిపిస్తోంది. దర్సనాన్ని ప్రారంభించినా భక్తుల రద్దీ మాత్రం చాలా తక్కువగానే కనిపిస్తోంది.